సూర్య, జ్యోతిక.. మళ్లీ పెళ్లి చేసుకున్నారు.. అవును మీరు చదివింది నిజమే. అదేంటి అప్పుడెప్పుడో పెళ్లి అయిపోయింది అనుకుంటున్నారా? అవును వారికి 20 ఏళ్ల క్రితం పెళ్లి అయింది. అయితే ఇప్పుడు మరోసారి పెళ్లి చేసుకొని.. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఎందుకు అనేది మీకు అర్థమైపోయుంటుంది. సూర్య – జ్యోతిక సెప్టెంబర్ 11 2006న ప్రేమ వివాహం చేసుకున్నారు. 20వ యానివర్శిరీన నేపథ్యంలో మరోసారి పెళ్లి చేసుకోవాలని అనుకుని డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు.
కోలీవుడ్‌లో క్యూట్ కపుల్, పేరు పొందిన సూర్య, జ్యోతిక విదేశాల్లోని క్రైస్తవ సంప్రదాయం ప్రకారం వివాహ వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ వేడుకలో జ్యోతిక వైట్ కలర్ వెడ్డింగ్ గౌనులో మెరవగా.. సూర్య వైర్ కలర్ సూట్, బ్లాక్ ట్రౌజర్‌లో బ్లాక్‌బస్టర్ హిట్‌లా అదిరిపోయాడు. సూర్య, జ్యోతికల వివాహ వార్షికోత్సవాన్ని వారి పిల్లలు దియా, దేవ్.. కార్తి దగ్గరుండి చూసుకున్నారు. ఈ వేడుకకు వారి ఇతర కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది బంధు మిత్రులు హాజరయ్యారు.
‘‘ది సీక్వెల్… మా 20 ఏళ్ల ప్రేమ ప్రయాణాన్ని వేడుకగా జరుపుకున్నాం’’ అని ఆ వీడియోకు సోషల్ మీడియాలో క్యాప్షన్‌గా పెట్టరు సూర్య, జ్యోతిక. ఈ వేడుక ఓ పరిపూర్ణమైన వివాహానికి సంకేతం మాత్రమే కాదని… ఓ జంట అసమానతలు, సర్దుబాట్లు, ఒకరినొకరు అర్థం చేసుకోవడం, త్యాగాలు, నిస్వార్థమైన ప్రేమను ప్రతిబింబించే వేడుక అని జ్యోతిక రాసుకొచ్చారు. తనను తన కంటే ఎక్కువగా గౌరవించే వ్యక్తి భర్తగా లభించడం వరమని కూడా చెప్పారామె.
సూర్య, జ్యోతిక ప్రయాణం ‘పూవెల్లామ్ కేట్టుప్పార్’ 1999లో స్టార్ట్ అయింది. ఆ తర్వాత ‘ఉయిరిలే కలందదు’, ‘కాక కాక’, ‘పేరళగన్’, ‘మాయావి’, ‘సిల్లును ఒరు కాదల్’ తదితర సినిమాల్లో కలసి నటించారు. ఆ స్నేహం ప్రేమగా మారి.. ఆ తర్వాత సెప్టెంబరు 11, 2006న వివాహ బంధంతో ఒకటయ్యారు. వారికి 2007లో దియా, 2010లో దేవ్ జన్మించారు. వారి పేరు మీదే 2D ఎంటర్‌టైన్మెంట్స్ అనే సినిమా ప్రొడక్షన్ హౌస్‌ను సూర్య – జ్యోతిక ఏర్పాటు చేశారు.