Bethlehem Kudumba Unit: అన్ని సినిమాలను దాటేసిన మమితా బైజు సినిమా.. వసూళ్లెంత అంటే

కంటెంట్‌కి క్యూట్‌నెస్‌, క్యూరియాసిటీ కనెక్ట్‌ చేసి.. బాక్సాఫీస్‌ని కొల్లగొట్టడం మాలీవుడ్‌కి అలవాటైపోయింది. సినిమాలో ఈ మూడు అంశాలు అంటే విజయం పక్కా అని అర్థం చేసుకున్న టీమ్‌.. ఇదే స్టైల్‌లో మరో సినిమా తీసుకొచ్చి రూ.300 కోట్లకుపైగా వసూళ్లు అందేసుకుంది. ఒకప్పుడు రూ.100 కోట్ల సినిమా అంటేనే పెద్ద విషయం అనుకున్న మలయాళ సినిమాలో ఈ ఏడాది ఇప్పటికే రూ.100 కోట్లకుపైగా వసూళ్లు వచ్చిన నాలుగు సినిమాలను సంపాదించింది అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

Bethlehem Kudumba Unit

ఈ లిస్ట్‌లో నివిన్ పౌలి, మమితా బైజు జంటగా నటించిన ‘బెత్లెహొమ్‌ కుడుంబ యూనిట్‌’ టాప్‌లో నిలిచింది. రూ.300 కోట్ల మైలురాయిని ఈ సినిమా దాటి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ క్రమంలో మలయాళ సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా అగ్రస్థానంలో నిలిచింది. రూ.25 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు సుమారు 1,120 శాతం లాభాలు వచ్చాయంటే ఎంతటి విజయం అందుకుందో మీకే అర్థమైపోతుంది.

మాలీవుడ్లో ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా అంటే.. కల్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో నటించిన ‘లోకా ఛాప్టర్ 1: చంద్ర’. ఈ సినిమా ఇండియన్‌ బాక్సాఫీసు దగ్గర రూ.301.41 కోట్లు వసూళ్లు అందుకుంది. ఆ తర్వాత మోహన్‌లాల్, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ నటించిన ‘ఎల్‌ 2: ఎంపురాన్‌’ రూ.268 కోట్లతో మూడో స్థానంలో నిలిచింది. ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’ రూ. 242 కోట్లతో నాలుగో స్థానంలో ఉండగా.. ఐదో స్థానంలో ‘దృశ్యం 3’ రూ.240 కోట్లతో ఉంది.

ఇక ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ సినిమాలు చూస్తే.. ‘బెత్లెహొమ్‌ కుడుంబ యూనిట్’ (రూ.310 కోట్లు), ‘దృశ్యం 3’ (రూ.239.90 కోట్లు), ‘వాలా 2: బయోపిక్ ఆఫ్ ఎ బిలియన్ బ్రోస్’ (రూ.235.04 కోట్లు), ‘ఆడు 3’ ( రూ.120 కోట్లు), ‘పేట్రియాట్’ (రూ.80 కోట్లు) టాప్‌ 5లో ఉన్నాయి.

ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus