క్యాస్టింగ్ కౌచ్ అనేది కొత్త టాపిక్ ఏమీ కాదు. ‘మీటూ’ టైమ్లో దీని గురించి ఆడియన్స్ కి ఒక కన్ఫ్యూజన్ ఉండేది. కానీ ఆ టైమ్లో చాలా మంది మీడియా ముందుకు వచ్చి తమ కెరీర్ స్టార్టింగ్లో ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి మాట్లాడారు. అయితే ఎక్కువ శాతం అందులో ఫేడౌట్ అయిన బ్యాచ్ ఉన్నారు. అటెన్షన్ కోసమే వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అని కొంతమంది అనుకున్నారు.
అలాగే ‘ఎదుగుతున్న టైమ్లో నటీమణులు ఇలాంటి విషయాల గురించి మీడియా ముందు మాట్లాడరు.. ఒకవేళ మాట్లాడితే వాళ్ళకి అవకాశాలు రావు కాబట్టి’ అని ఆడియన్స్ కూడా ఫిక్స్ అయ్యారు. సో ‘క్యాస్టింగ్ కౌచ్’ విషయంలో ఆడియన్స్ కి ఒక క్లారీటీ ఉంది. ఇండస్ట్రీలో ఇది లేదు అనడానికి ఏమీ లేదు. అలా అని సినీ పరిశ్రమలో మాత్రమే ఇది ఉంటుంది అనడం కూడా తప్పు. అన్ని పరిశ్రమాల్లోనూ ఉంటుంది.
కానీ సినీ పరిశ్రమపై మాత్రమే అందరి చూపు ఉంటుంది. సరే ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. ‘క్యాస్టింగ్ కౌచ్’ అంశం గురించి యాంకర్ స్రవంతి(Sravanthi Chokkarapu) తనదైన శైలిలో స్పందించింది. తన ‘హే భగవాన్’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయం పై స్పందించడం జరిగింది.స్రవంతి మాట్లాడుతూ… “ఇటీవల ఓ అమ్మాయి నాకు ట్విట్టర్లో ఓ మెసేజ్ పెట్టింది.
ఆ మెసేజ్లో ‘సినీ పరిశ్రమలో కమిట్మెంట్ ఇస్తేనే ఎదగగలమా? లేక మరో మార్గం ఉందా?’ అని ఉంది. హానెస్ట్ గా చెబుతున్నా.. ‘నా కెరీర్లో ఇప్పటివరకు నాకు అలాంటి అనుభవం ఎదురవ్వలేదు.ఎదుటివాళ్ల ప్రవర్తన కూడా మన ప్రవర్తన మీదే ఆదారపడి ఉంటుంది అని నేను నమ్ముతాను. వాళ్ళు మనపట్ల అలా ఆలోచిస్తున్నారు అంటే మన ప్రవర్తనలో కూడా లోపం ఉన్నట్టే.! మనం కరెక్ట్ గా మసులుకుంటే ఎవ్వరూ మనల్ని బలవంతం చేయరు.
అందరూ నిజాయితేగానే ఉంటారు అని నేను చెప్పడం లేదు. కానీ మనం నిజాయితీగా పనిచేసుకుంటే ఎవ్వరూ మనల్ని ఇబ్బంది పెట్టరు. ఎండ్ ఆఫ్ ది డే మన వర్క్ బాగుంటే అదే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. నా ఫ్రెండ్స్ దగ్గర కూడా ఈ టాపిక్ వస్తుంది. దీనికి గురించి మేము చర్చించుకుంటాం. కానీ ఎవ్వరూ కూడా ఇబ్బంది పడినట్టు నా దగ్గర చెప్పలేదు” అంటూ చెప్పుకొచ్చింది.