Bigg Boss 5 Telugu: ఎవరికోసం ఈ కలవరింతలు..?

Advertisement

నవరాత్రి స్పెషల్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత శ్వేత శ్రీరామ్ చంద్ర ఎమోషన్ ని కంట్రోల్ చేస్కోమని చెప్పింది. అంతేకాదు,వాళ్లు హమీదా ఎలిమినేషన్ గురించి మాట్లాడుకున్నారు. ఆ తర్వాత అర్ధరాత్రి నిద్రపోతూనే శ్రీరామ్ చంద్ర గట్టిగట్టిగా అరుస్తూ కలవరించాడు. నిజానికి హమీదా వెళ్లిపోయాక శ్రీరామ్ చాలా డల్ అయ్యాడు. బాగా ఫీల్ అయ్యాడు. నిద్రలో కలవరించింది హమీదా కోసమా.. లేదా షణ్ముక్ ఇంకా సిరి, జెస్సీలు పెడుతున్న టార్చర్ కోసమా అనేది తెలీదు కానీ , విశ్వ మాత్రం పక్కనే ఉండి ధైర్యం ఇచ్చాడు.

శ్రీరామ్ వీపు నుమురుతూ అతడి పరిస్థితిని అర్ధం చేస్కుంటూ నిద్రపుచ్చాడు.ఇక్కడే మిగతా హౌస్ మేట్స్ కూడా ఉలిక్కిపడి మరీ లేచారు. ఇక తెల్లారిన తర్వాత నామినేషన్స్ గురించే షణ్ముక్ , సిరి ఇంకా జెస్సీలు మాట్లాడుకున్నారు. ఈసారి శ్రీరామ్ ఖచ్చితంగా నిన్ను చేస్తాడు. ఎక్కడా తగ్గద్దు.. ఇప్పట్నుంచే మాటలు ప్రిపేర్ చేస్కో అంటూ చెప్పాడు. అతడు ఏపాయింట్ పైన చేస్తాడో అదే మాట్లాడతాను అంటూ చెప్పింది సిరి. అంతేకాదు, షణ్ముక్ ఈసారి నామినేషన్స్ లో కరెక్ట్ పాయింట్ మాట్లాడమని,

ఎక్కడా తగ్గద్దు అంటూ సిరిని ఉసిగొల్పాడు. ముందుగానే సిరి మైండ్ ని ప్రిపేర్ చేశాడు. ఆ తర్వాత అనుకున్నట్లుగానే శ్రీరామ్ సిరిని, ఇంకా షణ్ముక్ ని నామినేట్ చేసాడు. అలాగే షణ్ముక్ కూడా శ్రీరామ్ ని నామినేట్ చేశాడు. ఇద్దరిమద్యలో కూడా చాలా హీటెడ్ ఆర్గ్యూమెంట్ అనేది జరిగింది. ఈసారి నామినేషన్స్ లో ఏకంగా 10మంది ఉండటం అనేది విశేషం. అదీ మేటర్.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus