Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

‘దసరా’ సినిమా బాక్సాఫీసు దగ్గర భారీ విజయం అందుకుంది. మాస్‌ హీరోగా తన ముద్ర వేయాలని ఎప్పటి నుండో అనుకంటూ వస్తున్న నానికి ఆ సినిమా ఆ అవకాశం వచ్చింది. వచ్చిన అవకాశాన్ని పర్‌ఫెక్ట్‌గా వాడుకున్నాడు అని అంటారు కొంతమంది. అయితే సినిమా ఇంకాస్త బాగుండాల్సింది. హాఫ్‌ బేక్డ్‌ మాస్‌ సినిమా అనే వారూ ఉన్నారు. ఈ మాటను ఇన్నాళ్లూ నాని అభిమానులు, ఒక్కోసారి నాని ఒప్పుకోలేదు. అయితే ఇప్పుడు నానినే ఈ అర్థం వచ్చేలా మాట్లాడాడు.

Srikanth Odela

‘దసరా’ సినిమా హిట్టయిన తర్వాత అందరం సంతోషంగా ఉన్నాం. తర్వాత శ్రీకాంత్ ఏం చేస్తాడా? ఎలాంటి కథతో ముందుకు వస్తాడో అని అనుకున్నాం. కానీ ఓ రోజు తన దగ్గరకు శ్రీకాంత్‌ చాలా నిరాశగా వచ్చాడు అని నాని చెప్పాడు. సారీ అన్నా ‘దసరా’ ఇంకా బాగా చేయాల్సింది. సరిగ్గా చేయలేకపోయాను అన్నాడు. ఈసారి సినిమా చేస్తే, ఇలా ఉండాలి? అని రెండు మూడు పాయింట్స్‌ చెప్పాడు. అందులో కొటి నాకు నచ్చింది అని నాని చెప్పాడు.

శ్రీకాంత్‌ ఓ సినిమాను ఎలా చూస్తారో చెప్పడానికి ఆ మాట అన్నాడో, లేక సినిమా విషయంలో టీమ్‌ ఉద్దేశం అలానే ఉందో తెలియదు కానీ.. ‘దసరా’ సినిమా ఫలితం గురించి బయట ఉన్న విమర్శలకు మద్దతు తెలిపేలా శ్రీకాంత్‌ ఓదెల చెప్పిన మాటలు అనిపిస్తున్నాయి. ఈ విషయంతోపాటు ‘ప్యారడైజ్‌’ విషయంలో జరిగిన మరో మేటర్‌ కూడా చెప్పాడు నాని. ‘ప్యారడైజ్‌’ లైన్‌ ఓకే అనుకున్నాక కథ డెవలప్‌ చేయడానికి మూడు నెలల సమయం అడిగారట శ్రీకాంత్‌.

అలా ఓకే అనుకుని వెళ్లాక మళ్లీ ఎనిమిది నెలల తర్వాత కనిపించారట. వచ్చి కథ చెప్పాక మరో ఆలోచన లేకుండా నాని ఓకే చెప్పేశారట. ఇప్పటివరకూ ‘ప్యారడైజ్‌’ అంటే బిర్యానీ లేదా హైదరాబాద్‌లో ఒక ప్లేస్‌ గుర్తొచ్చేదని, ఇక నుండి ఈ పేరు చెబితే తమ సినిమానే గుర్తొస్తుందని నాని నమ్మకంగా చెప్పాడు. ఈ ముచ్చట్ల సంగతి తేలాలి అంటే సెప్టెంబరు 24 రావాల్సిందే. ఆ రోజు ‘జడల్‌’ గాని సత్తా తేలిపోతుంది.

ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus