Srikanth Reddy: బిగ్ బాస్ సీజన్ 6 ఛాన్స్ కొట్టేసిన శ్రీకాంత్ రెడ్డి?

  • May 17, 2022 / 03:17 PM IST

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో సందడి చేస్తున్న బిగ్ బాస్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో ఇప్పటి వరకు ఐదు సీజన్లను పూర్తిచేసుకున్న ఈ కార్యక్రమం ప్రస్తుతం బిగ్ బాస్ నాన్ స్టాప్ పేరుతో ఓటీటీలో ప్రసారం అవుతూ చివరి దశకు చేరుకుంది. ఈ క్రమంలోనే తిరిగి బుల్లితెరపై సీజన్ సిక్స్ ప్రారంభించాలని నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఒకవైపు బిగ్ బాస్ కార్యక్రమాలను శరవేగంగా కొనసాగిస్తున్నప్పటికీ మరోవైపు నిర్వాహకులు కంటెస్టెంట్ ల ఎంపిక ప్రక్రియలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరి పేర్లను పరిగణలోకి తీసుకున్న నిర్వాహకులు ఈ సీజన్ లోకి ఎప్పటిలాగే ఒక యూట్యూబ్ స్టార్ ను పంపించాలని భావిస్తోంది. అయితే మొన్నటి వరకు యూట్యూబ్ ఫ్రాంక్ స్టార్ గా కొంతమందికే పరిచయమున్న శ్రీకాంత్ రెడ్డి ప్రస్తుతం ఒక్కసారిగా ఎంతో పాపులర్ అయ్యారు. కరాటే కళ్యాణి గొడవ కారణంగా ఆయనకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.

ఈ క్రమంలోనే కరాటే కళ్యాణి యూట్యూబ్ స్టార్ పై గొడవకు రావడంతో ఎంతోమంది యూట్యూబర్స్ శ్రీకాంత్ రెడ్డికి పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా శ్రీకాంత్ రెడ్డి ఎంతో పాపులర్ అయ్యారు. ఇలా పాపులారిటీ సంపాదించుకున్న ఈయనను బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకురావాలని నిర్వాహకులు ప్రయత్నాలు చేస్తున్నారట.

ఈ క్రమంలోనే నిర్వాహకులు శ్రీకాంత్ రెడ్డిని సంప్రదించినట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.ఈ విధంగా శ్రీకాంత్ రెడ్డి గురించి వస్తున్న వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే ఈ విషయంపై బిగ్ బాస్ నిర్వాహకులు అధికారిక ప్రకటన చేసే వరకు వేచి చూడాలి. ఇకపోతే ఈ కార్యక్రమం అతి త్వరలోనే ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహేష్ బాబు 26 సినిమాలు.. మరియు వాటి బాక్సాఫీస్ కలెక్షన్లు..!
‘భద్ర’ టు ‘అఖండ’.. బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమాల కలెక్షన్లు..!
‘దూకుడు’ టు ‘సర్కారు వారి పాట’.. ఓవర్సీస్ లో మహేష్ బాబు 1 మిలియన్ మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus