Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

ఘట్టమనేని ఫ్యామిలీ నుండి మూడో తరం హీరోగా జయకృష్ణ ఘట్టమనేని ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా పేరు ‘శ్రీనివాస మంగాపురం'(Srinivasa Mangapuram) సూపర్ స్టార్ కృష్ణ పెద్ద మనవడిగా, మహేష్ బాబు అన్న రమేష్ బాబు తనయుడిగా జయకృష్ణ ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షించాడు. ‘వైజయంతీ మూవీస్’ ప్రతిష్టాత్మకంగా జయకృష్ణని లాంచ్ చేయనుంది. అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకుడు. మోహన్ బాబు స్పెషల్ రోల్ చేయగా రవీనా టాండన్ కుమార్తె రషా తడాని ఈ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది.

Srinivasa Mangapuram

జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమాలో ‘అల్లెల్లె..’ పాట మంచి హిట్ అయ్యింది. టీజర్, ట్రైలర్ వంటివి ఎలా ఉన్నా.. పెద్ద ఫ్యామిలీ నుండి వస్తున్న హీరో కాబట్టి.. సినిమాపై స్పెషల్ ఫోకస్ పడింది. రూ.25 కోట్లు బడ్జెట్ పెట్టి తీసిన ఈ సినిమాని కొన్ని ఏరియాలు మినహా.. ఓన్ రిలీజ్ చేసుకున్నారు నిర్మాతలు. మరి బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్ ను ఓ లుక్కేద్దాం రండి :

తెలంగాణ 2 cr
సీడెడ్ 0.50 cr
ఆంధ్ర(టోటల్) 3 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 5.5 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా+ఓవర్సీస్ 0.50 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 6.5 cr

‘శ్రీనివాస మంగాపురం’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.6 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.6.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. సినిమాకి పాజిటివ్ టాక్ కనుక వస్తే.. బ్రేక్ ఈవెన్ సాధించడం సాధ్యమవుతుంది. లేదు అంటే ‘స్పైడర్ మెన్’ పోటీగా ఉండగా.. టార్గెట్ ను రీచ్ అవ్వడం కష్టమవుతుంది.

ఆమె పీఆర్‌ టీమ్‌ పని స్టార్ట్‌ చేసిందా.. అందుకేనా సాయిపల్లవిపై కామెంట్స్‌?

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus