Sriya Reddy: ‘సలార్’ బ్యూటీకి అలా కూడా కలిసొచ్చేస్తుంది!

  • February 2, 2024 / 12:11 PM IST

‘సలార్’ సినిమా గత ఏడాది డిసెంబర్ చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా పాజిటివ్ టాక్ ను రాబట్టుకోవడంతో పాటు షారుఖ్ ఖాన్ ‘డంకీ’ సినిమాని డామినేట్ చేయడం అందరికీ షాకిచ్చింది. పోటీ వల్ల రూ.1000 కోట్ల మార్క్ ను మిస్ అయినప్పటికీ, పార్ట్ 2 పై మాత్రం భారీ హోప్స్ ఇచ్చిందనే చెప్పాలి. ఇదిలా ఉండగా.. ‘సలార్’ సినిమాలో ప్రభాస్ మాత్రమే కాదు మరికొన్ని పాత్రలు కూడా ప్రేక్షకులను కట్టిపడేశాయి అని చెప్పాలి.

అందులో రాధా రమ మన్నార్ అనే పాత్ర కూడా ఒకటి. ఈ పాత్ర చేసింది ఒకప్పటి హీరోయిన్ (Sriya Reddy) శ్రీయా రెడ్డి. ఇంటర్వెల్ సీక్వెన్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లేది ఈ పాత్రే అని చెప్పడంలో సందేహం లేదు. ఇంకో విధంగా చెప్పాలి అంటే ‘సలార్’ మొదటి భాగం ఈమె పాత్ర వద్ద ఎండ్ అయినట్టే. సెకండ్ పార్ట్ లో కూడా ఈమె పాత్ర కీలకంగా ఉండే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉండగా.. మాస్ సినిమాల్లో లేడీ విలన్ పాత్రలు ఉంటే డ్రామా బాగా పండుతుంది.

వరలక్ష్మీ శరత్ కుమార్ ద్వారా ఆ విషయం పై మేకర్స్ కి క్లారిటీ వచ్చింది. అలాగే అలాంటి వారు సహాయనటి పాత్రలు చేసినా వర్కౌట్ అవుతాయి. అది కూడా వరలక్ష్మీనే ‘హనుమాన్’ ద్వారా ప్రూవ్ చేసింది. సో ఇప్పుడు శ్రీయారెడ్డికి అలాంటి పాత్రలే వస్తున్నాయట. ఆమె ప్రస్తుతం ‘ఓజీ’ లో నటిస్తుంది. అలాగే టాలీవుడ్లో రూపొందే కొన్ని పెద్ద సినిమాలకి కూడా శ్రీయారెడ్డిని సంప్రదిస్తున్నారట.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus