కరోనా కాటుకు మరో సినీ నటుడు మృతి

  • May 8, 2021 / 12:54 PM IST

కరోనా వైరస్ రోజురోజుకు మరింత భయంకరంగా విస్తరిస్తోంది. వ్యాక్సిన్ వేసుకోవాలని ఎగబడుతున్న జనాలు కూడా కోవిడ్ బారిన పడుతున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఏ రాష్ట్రంలో చూసినా కూడా మరణ వార్తలు కలచి వేస్తున్నాయి. ఇక ఎంతో జాగ్రత్తగా ఉండే కొంతమంది సినీ ప్రముఖులు కూడా మృత్యువాత పడుతుండడం షాక్ కి గురి చేస్తోంది. ఇక ఇటీవల మరొక సీనియర్ కన్నడ నటుడు కూడా కరోనా బారిన పడి శ్వాస విడిచారు.

దాదాపు 250కి పైగా సినిమాల్లో నటించిన కన్నడ సీనియర్ నటుడు శంకనాడ అరవింద్ శుక్రవారం కన్నుమూశారు. గత వారం రోజులుగా బెంగుళూరులోని ఒక ప్రయివేట్ హాస్పిటల్ లో చికిత్స అందుకుంటున్న అరవింద్ హఠాత్తుగా మరణించడంతో కన్నడ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అరవింద్ మరణించిన వార్తను ఆయన కూతురు మనసా హోల్లా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఆమె కూడా ఇండస్ట్రీలో మంచి మ్యూజిక్ డైరెక్టర్ గా గుర్తింపు అందుకుంటున్నారు.

ఇక తండ్రి మరణంతో తమ కుటుంబానికి ఇది తీరని లోటు అంటూ మానస ఎమోషనల్ అయ్యారు. కేవలం మంచి నటుడిగానే కాకుండా మానవత్వ విలువలున్న మంచి వ్యక్తిని కోల్పోయామని కన్నడ సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus