తన భర్తతో ఎఫైర్ పెట్టుకున్న మహిళకు మాస్ వార్నింగ్ ఇచ్చిన ప్రముఖ నటి.. వైరల్ అవుతున్న వీడియో..

  • February 4, 2023 / 06:59 PM IST

రాఖీ సావంత్.. ఈ బాలీవుడ్ భామ ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో వేలు పెడుతుంటుంది. సోషల్ మీడియాలో ఆమె చేసే రచ్చ మామూలుగా ఉండదు. రీసెంట్‌గా తన భర్తతో ఎఫైర్ పెట్టుకున్న మహిళకు మాస్ వార్నింగ్ ఇచ్చిందామె. తను ఇష్టపడి పెళ్లి చేసుకున్న వ్యక్తిని తన నుండి దూరం చేసిందంటూ సదరు మహిళను కన్నీంటి పర్యంతమవుతూ హెచ్చరిస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మతం మారి మరీ పెళ్లి చేసుకున్న ఆదిల్‌ వేరే మహిళతో ఎఫైర్‌ పెట్టుకున్నాడని ఆరోపించింది.

‘‘నా కంట్లోంచి రాలుతున్న ప్రతీ కంటి చుక్కకి ప్రతీకారం నా దేవుడు తీర్చుకుంటాడు.. నేను తలిదించుకుని మౌనంగా ఉంటా.. అలాగే నా స్వాభిమానం, నా భర్త కోసం తల పైకెత్తి పోరాటం కూడా చేస్తాను. మీడియా ముందు ఆ మహిళకు వార్నింగ్‌ ఇస్తున్నాను.. పెళ్లైన మా భార్యా భర్తల మధ్యలోకి వస్తే.. సిగ్గుండాలి.. ఓ మహిళ మరో మహిళ జీవితాన్ని నాశనం చేస్తుందా?.. మనిషి అంటేనే ఓ కుక్క..

నువ్వు పెళ్లి అయిన ఇళ్లాలి జీవితాన్ని నాశనం చేద్దామనుకుంటున్నావా? సంతోషించు.. నేను నీ పేరు చెప్పడం లేదు. ఆదిల్‌ నీకు కూడా వార్నింగ్‌ ఇస్తున్నా.. ఆమెను వదిలిపెట్టి ఇంటికి వచ్చేయ్‌.. వేరే మహిళల్లాగా నేను కామ్‌గా ఉండను.. నీకోసం ఎంతో చేసిన నాకు ఎలాంటి కానుక ఇచ్చావు?’’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది రాఖీ సావంత్..

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus