మాజీ ప్రియుడి షరతుల వల్ల పెళ్లిపై విరక్తి.. నటి కామెంట్స్ వైరల్!

మోహన్ లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన మలైకొట్టై వాలిబన్ సినిమా ఈ నెల 25వ తేదీన థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన సుచిత్ర నాయర్ తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. మలయాళ బిగ్ బాస్ షోలో నన్ను చూసిన డైరెక్టర్ లిజో సార్ సినిమా కోసం నన్ను ఎంపిక చేశారని ఆమె అన్నారు.

మలైకొట్టై వాలిబన్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిన మూవీ అని తొలి సినిమానే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో తెరకెక్కడం సంతోషాన్ని కలిగించిందని గొప్ప నటీనటులతో కలిసి పని చేయడం చాలా సంతోషంగా ఉందని సుచిత్ర నాయర్ తెలిపారు. తాజాగా ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్ లో నేను కూడా ఉన్నానని ఆమె చెప్పుకొచ్చారు. ఆ సాంగ్ వల్ల నాకు ఆఫర్లు పెరిగాయని సుచిత్ర నాయర్ అన్నారు.

పెళ్లిపై నాకు ఆసక్తి లేదని పెళ్లి అవసరం లేదనుకున్నా లైఫ్ లాంగ్ ఒత్తిడిని భరించలేనని నన్ను అర్థం చేసుకునే వ్యక్తి నా జీవితంలోకి వస్తే పెళ్లి చేసుకుంటానని ఆమె చెప్పుకొచ్చారు. నేను నా బ్రేకప్ బాధ నుంచి ఇప్పటికీ బయటపడలేదని సుచిత్ర కామెంట్లు చేశారు. ఒక వ్యక్తిని డీప్ గా లవ్ చేశానని అయితే ఆ వ్యక్తి నాకు చాలా షరతులు విధించాడని అమె చెప్పుకొచ్చారు.

దుస్తుల విషయంలో, మాట్లాడే మాటల విషయంలో, బయటకు వెళ్లే విషయంలో అతను ఎన్నో షరతులు విధించాడని సుచిత్ర చెప్పుకొచ్చారు. నాకు నచ్చినట్టుగా బ్రతకనివ్వలేదని ఎక్కడికి వెళ్లినా తన అనుమతి ఉండాలని మనస్పర్ధలు రావడం వల్ల మేము విడిపోయామని ఇలాంటి వ్యక్తిని నేను ప్రేమించానా అని అతనిపై అసహ్యం కలిగిందని సుచిత్ర కామెంట్లు చేశారు. సుచిత్ర (Suchitra Nair) చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus