ప్రముఖ నటి, ఆమె కూతురితో పాటు మరదలిని కూడా వేధించిన ఆ వ్యక్తి ఎవరంటే..!

సామాజిక మాధ్యమాలను సరైన పద్ధతిలో ఉపయోగిస్తే దాని వల్ల మంచి ప్రయోజనాలుంటాయి.. అయితే కొంతమంది వీటిని తమ పైశాచికానందం కోసం వాడుతూ.. ఎంతోమందిని ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ముఖ్యంగా వారిలో మహిళలే అధికం. సెలబ్రిటీల విషయానికొస్తే వారికిలాంటి చేదు అనుభవాలు ఎదురైన సంఘటనలు చాలానే ఉన్నాయి.. ఇటీవలే యాంకర్, యాక్ట్రెస్ అనసూయను గతకొద్ది కాలంగా వేధిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.. తాజాగా మరో ప్రముఖ నటికి కూడా ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది.

చాలా కాలంగా ఆ నటితో పాటు ఆమె కుటుంబానికి చెందిన మరో ఇద్దరు మహిళలను కూడా ఓ స్టూడెంట్ టార్గెంట్ చేసి నానా ఇబ్బందులూ పెట్టాడని చెప్తూ కన్నీటి పర్యంతరమయ్యారామె. ఇంతకీ ఎవరా నటి?.. ఆమె ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ఏం చెప్పారు?.. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.. ప్రవీణా నాయర్.. పాపులర్ కోలీవుడ్ సీరియల్ నటి.. ఢిల్లీకి చెందిన భాగ్యరాజ్‌ అనే స్టూడెంట్‌ ప్రవీణా ఫొటోలను మార్ఫింగ్‌ చేసి ఆన్‌లైన్‌లో పెట్టాడు.

విషయం తెలుసుకున్న నటి పోలీసులను ఆశ్రయించడంతో.. పోలీసులు భాగ్యరాజ్‌ని అరెస్ట్‌ చేశారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. కొన్ని రోజులు జైల్లో ఉండి, తర్వాత బెయిల్‌ మీద రిలీజయ్యాడు. కొద్ది కాలం తర్వాత ప్రవీణాకు మరో భారీ షాక్ తగిలింది. భాగ్యరాజ్‌ఈ సారి ఆమె కూతురు గౌరీ నాయర్‌ను కూడా టార్గెట్‌ చేస్తూ మార్ఫింగ్‌ ఫొటోలు విడుదల చేశాడు. గతంలో తన ఫొటోలు మార్ఫింగ్‌ చేసిన వ్యక్తే ఈ సారి తన కూతుర్ని టార్గెట్‌ చేశాడని, మార్ఫింగ్‌ ఫొటోలతో ఇబ్బంది పెడుతున్నాడని ఫిర్యాదు చేసింది.

ఇటీవల ఈ సంఘటన గురించి పలు ఊహించని విషయాలు వెల్లడించారు ప్రవీణా.. ‘‘సోషల్‌ మీడియాలో ఉన్న నా మిత్రుల ద్వారా ఈ విషయం తెలిసింది. భాగ్యరాజ్‌ అనే వ్యక్తి నావి, నా కూతురివి, నా మరదలివి మార్ఫింగ్‌ ఫొటోలు క్రియేట్‌ చేశాడు. నా పేరుతో ఏకంగా 100 ఫేక్‌ ఐడీలు క్రియేట్‌ చేసి.. పిక్స్ పోస్ట్ చేస్తున్నాడు. తర్వాత నా కూతుర్ని కూడా వదల్లేదు. నా చుట్టూ ఉన్న అందరు మహిళల్ని అతడు టార్గెట్‌ చేశాడు.

కొంతమంది ఇలా సైకోల్లా ఉంటారు’’ అని చెప్తూ కంటతడి పెట్టుకున్నారు ప్రవీణా నాయర్.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.. ఈ విషయం తెలిసి నెటిజన్లు, మహిళలు.. ఆ వ్యక్తి జీవితంలో మళ్లీ ఇలాంటి వెధవ వేషాలు వెయ్యకుండా గట్టిగా బుద్ధి చెప్పాలంటూ కామెంట్స్ చేస్తున్నారు..

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus