Ileana: బేబీ బంప్ వీడియోతో మళ్ళీ షాక్ ఇచ్చిన స్టార్ హీరోయిన్!

స్టార్ హీరోయిన్లు కొంతమంది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. వాళ్ళు పోస్ట్ చేసే వీడియోలు కూడా తెగ వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఇలియానా పెట్టిన ఓ వీడియో ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. ఆ వీడియోలో ఆమె బేబీ బంప్‌తో కనిపించడంతో, ముచ్చటగా మూడోసారి తల్లి కాబోతోందా? అనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ విషయంపై ఆమె అధికారికంగా ఏమీ ప్రకటించకపోయినా, ఈ వీడియో మాత్రం నెట్టింట వైరల్‌గా మారింది.

Ileana

గతేడాది ఆగస్టులో మొదటి కొడుకు కోవా ఫీనిక్స్ డోలన్‌కు, ఈ ఏడాది జూన్‌లో రెండో కొడుకు కీనూ రాఫే డోలన్‌కు ఇలియానా జన్మనిచ్చింది. రెండో బాబు పుట్టి కేవలం ఐదు నెలలే అవుతుండటంతో, ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ షాకవుతున్నారు. అయితే, ఇలియానా షేర్ చేసిన ఈ వీడియో ఇప్పటిదా లేక పాతదా అనే దానిపై క్లారిటీ లేదు. కేవలం వీడియోను బట్టి, ఆమె మరోసారి గర్భం దాల్చిందనే ప్రచారం మొదలైంది. ఈ వీడియోపై నెటిజన్లు మిక్స్‌డ్ రియాక్షన్స్ ఇస్తున్నారు. “ఇది నిజమేనా?” అని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే, మరికొందరు ముందుగానే శుభాకాంక్షలు చెబుతున్నారు.

ఈ వార్త నిజమైతే, మీ ఫ్యామిలీ మరింత పెద్దది కాబోతున్నందుకు సంతోషం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఒకప్పుడు తన వ్యక్తిగత జీవితంపై ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న ఇలియానా, భర్త మైఖేల్ డోలన్‌తో పెళ్లి తర్వాత పూర్తిగా ఫ్యామిలీ లైఫ్‌కే పరిమితమైంది. ఇప్పుడు ఈ కొత్త వీడియోతో మరోసారి వార్తల్లో నిలిచింది. ఒకప్పుడు ‘పోకిరి’, ‘జల్సా’ వంటి బ్లాక్‌బస్టర్లతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ అందాల తార, ఇప్పుడు టాలీవుడ్ సినిమాలకు పూర్తిగా దూరమైంది.

నితిన్ ఔట్.. శర్వానంద్ ఇన్

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus