నితిన్ ఔట్.. శర్వానంద్ ఇన్

శ్రీను వైట్ల ఒకప్పుడు వరుస హిట్లు ఇచ్చిన దర్శకుడే. స్టార్ హీరోలు సైతం శ్రీను వైట్ల దర్శకత్వంలో సినిమాలు చేయాలని ఆసక్తి చూపించారు. కానీ తర్వాత ప్లాపులు వెంటాడాయి. ఫామ్ కోల్పోయారు. ఒక దశలో శ్రీను వైట్ల ఫేడౌట్ అయిపోయారు అని అంతా అనుకున్నారు. కానీ ‘విశ్వం’ తో కొంత పర్వాలేదు అనిపించారు. ఆ సినిమా హిట్ కాదు. కానీ అబౌవ్ యావరేజ్ రిజల్ట్ తో శ్రీను వైట్ల స్టామినా తగ్గలేదు అని ప్రూవ్ చేసింది.

Srinu Vaitla

సరైన రైటింగ్ టీం ఉంటే.. శ్రీను వైట్ల మళ్ళీ సాలిడ్ హిట్ ఇచ్చే ఛాన్స్ ఉంది అని చాటి చెప్పింది. అందుకే ఈసారి నందు వంటి టాప్ రైటర్ ను పెట్టుకుని ఓ మంచి కథ డిజైన్ చేయించుకున్నారు. స్క్రిప్ట్ ఆల్మోస్ట్ లాక్ అయ్యింది. నితిన్ ని హీరోగా అనుకున్నారు. మైత్రి సంస్థ ఈ ప్రాజెక్టుని నిర్మించనుంది.

అయితే ఊహించని విధంగా ఈ ప్రాజెక్టు నుండి నితిన్ తప్పుకున్నాడు. దీంతో శర్వానంద్ వచ్చి చేరినట్టు తెలుస్తుంది. శర్వానంద్ కూడా ఇప్పుడు 3 ప్రాజెక్టులతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ‘నారి నారి నడుమ మురారి’ వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుంది. అలాగే అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా, సంపత్ నంది దర్శకత్వంలో ఇంకో సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు శ్రీను వైట్లతో కూడా చేతులు కలిపినట్టు స్పష్టమవుతుంది.

త్వరలోనే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. ఈ సినిమాతో అటు శర్వానంద్ ఇటు శ్రీను వైట్ల సాలిడ్ హిట్ కొట్టి ఫామ్లోకి వస్తారేమో చూడాలి

మెసెజ్‌తో మెప్పించిన ‘అరి’ దర్శకుడు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus