హీరోయిన్ అమలాపాల్ డెసిషన్స్ డేరింగ్ గా ఉంటాయి. గత ఏడాది విదులైన ఆడై సినిమా కోసం ఈమె ఏకంగా న్యూడ్ గా నటించింది. తెలుగులో ఈ చిత్రం ఆమెగా విడుదలయ్యింది. డైరెక్టర్ ఏ ఎల్ విజయ్ ని ప్రేమ వివాహం చేసుకున్న అమలా పాల్ పట్టుమని ఏడాది కూడా కాపురం చేయకుండానే విడాకులు ఇచ్చి ఆయనతో సంసారానికి బై బై చెప్పేసింది. వీరి విడాకులకు కారణం అమలా పాల్ పెళ్లి తరువాత సినిమాలు చేయనని చెప్పి, తరువాత మాట తప్పడమే అని విజయ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.
ఐతే వీళ్ళ వివాహ బంధం ముక్కలు కావడానికి అమల పాల్ కి ఉన్న అఫైర్స్ అని కూడా వినిపించింది. కారణం ఏదైనా వీరి పెళ్లి పెటాకులైంది. కాగా ఈ మధ్య అమలా పాల్ పెళ్లి మళ్ళీ వార్తలలోకి ఎక్కింది. సింగర్ భవీందర్ తో అమలాపాల్ పెళ్లి బట్టలలో కనిపించడంతో పాటు, లిప్ లాక్ ఫోటోలు బయటిBhavకి రావడంతో అమలా పాల్ రహస్య వివాహం చేసుకున్నారని వార్తలు వచ్చాయి. ఆ వార్తలు వచ్చిన వారం తరువాత అమలా పాల్ తీరిగ్గా వచ్చి, అదంతా అబద్దం అని చెప్పింది.
అవి ఓ ఫోటో షూట్ కోసం తీసిన ఫోటోలు, అంతే తప్ప నాకు పెళ్లి కాలేదని క్లారిటీ ఇచ్చింది. ఇక తాజాగా అమలా పాల్ ని పెళ్లి గురించి అడిగితే నేను ప్రేమలో ఉన్నాను. ప్రేమించిన వ్యక్తిని త్వరలో పెళ్లి చేసుకుంటాను. ప్రేమ గురించి చెప్పా కదా, ఆ సమయం వచ్చినప్పుడు పెళ్లి గురించి కూడా చెవుతా అని అందరి నోళ్లకు తాళం వేసింది.
Most Recommended Video
తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు!
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!