టాలీవుడ్ లో తెలుగమ్మాయిలకు హీరోయిన్ అవకాశాలు రావడం కష్టమే. ఒకరిద్దరు తప్ప స్టార్ స్టేటస్ అందుకున్నవారు కూడా లేరు. ప్రస్తుతం అయితే ఇండస్ట్రీలో రీతూవర్మ, ఈషారెబ్బ ఇలా చాలా తక్కువ మంది తెలుగమ్మాయిలు ఉన్నారు. దానికి కారణం తెలుగు వారికి అవకాశాలు ఇవ్వకపోవడమేనని అంటోంది ‘పచ్చీస్’ హీరోయిన్ శ్వేతావర్మ. బాలీవుడ్ లో హిందీ వచ్చిన వాళ్లని మాత్రమే హీరోయిన్లుగా తీసుకుంటారని.. కానీ టాలీవుడ్ లో మాత్రం తెలుగు రాని వాళ్లను కూడా హీరోయిన్లుగా ఎంపిక చేసుకుంటారని చెబుతోంది.
ఇక్కడ హీరోయిన్లకు సరైన ప్రాధాన్యత ఇవ్వరని.. సినిమా అవకాశాలు కూడా చాలా తక్కువని అంటోంది. అదే విధంగా టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ సమస్యలు ఉన్నాయని చెబుతోంది. గతంలో తను ఎదుర్కొన్న ఓ చేదు అనుభవాన్ని శ్వేతా తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. షార్ట్ ఫిలిమ్స్ లో నటిస్తోన్న సమయంలో కొందరు కమిట్మెంట్ ఇవ్వాలని అడిగారని.. మొదట వాళ్ల ఉద్దేశం తనకు అర్ధం కాలేదని.. ఇప్పటికీ దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ తన దగ్గరున్నాయని చెప్పింది.
2015లో యాడ్స్ కోసం సంప్రదించినప్పుడు.. లక్ష రూపాయలు ఇస్తాం.. కానీ దర్శకుడు కోరుకుంది చేయాలనీ చెప్పారట. దీంతో షాకైన ఆమె.. ఆ డైరెక్టర్ ను బిల్డింగ్ మీద నుండి దూకమనండి అంటూ బదులిచ్చింది. నేరుగా క్యాస్టింగ్ కౌచ్ సమస్యలు ఎదుర్కోకపోయినా.. ఆన్లైన్, సోషల్ మీడియా ద్వారా ఎదుర్కొన్నట్లు శ్వేతా చెప్పుకొచ్చింది.
Most Recommended Video
బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?