సినీ పరిశ్రమని విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. కొన్నాళ్లుగా.. ప్రతీరోజూ ఏదో ఒక బ్యాడ్ న్యూస్ వింటూనే ఉన్నాం. ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తండ్రి మరణించారు. ఆ తర్వాత స్టార్ నటుడు నాజర్ తండ్రి కూడా వయసు సంబంధిత సమస్యలతో మరణించిన సంగతి తెలిసిందే.ఇక అటు తర్వాత మలయాళ నటుడు కుందర జానీ, విజయ్ ఆంటోనీ పెద్ద కూతురు,బాలీవుడ్ నటి భైరవి, ‘సింగం’ దర్శకుడైన హరి తండ్రి వీఏ గోపాలకృష్ణన్, శృంగార నటి బాబిలోనా సోదరుడు విక్కీ,హాలీవుడ్ నటుడు, అమెరికాకు చెందిన కమెడియన్ మాథ్యూ పెర్రీ ..
ఇలా ఎంతో మంది మరణించారు. ఈ షాక్ ల నుండీ సినీ పరిశ్రమ ఇంకా కోలుకోక ముందే అత్యంత దారుణమైన సంఘటన మలయాళ సినీ పరిశ్రమలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ నటి డా.ప్రియ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయింది. బాధాకరమైన విషయం ఏంటంటే ఆమె 8 నెలల గర్భిణీ కావడం. నిన్న రాత్రి చెకప్ కోసం ఆమె ఆసుపత్రికి వెళ్లగా అక్కడ టెస్టులు తీస్తున్న సమయంలో.. గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయింది అని తెలుస్తుంది.
అయితే ఆపరేషన్ చేసి శిశువుని బయటకి తీసారట. ప్రస్తుతం ఆ శిశువును ఐ.సి.యు లో ఉంచినట్టు తెలుస్తుంది. ప్రముఖ నటుడు కిషోర్ సత్య సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలియజేశారు. ఈ విషయం తెలిశాక అందరూ.. ఆ శిశువు ఆరోగ్యంగా ఉండాలని, (Star Actress) ప్రియ ఆత్మకి శాంతి కలగాలని కామెంట్లు పెడుతున్నారు.
‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!