Star Actress: అవకాశాల కోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోమంటున్నారు.. హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్

సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన నటీనటులకు కెరీర్ ప్రారంభంలో ఏదో ఒక చేదు అనుభవం ఎదురయ్యే ఉంటుంది. కానీ వాటిని సందర్భం వచ్చినప్పుడు మాత్రమే బయట పెడుతూ ఉంటారు. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఇలాంటివి ఎక్కువగా వింటుంటాం. కెరీర్ ప్రారంభంలో ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనె వంటి హీరోయిన్లకి కూడా ఇలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయి. స్వయంగా వాళ్ళే ఈ విషయాలను బయటపెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా.. తాజాగా ఓ హీరోయిన్ కూడా అలాంటి అనుభవాన్ని బయటపెట్టింది.

వివరాల్లోకి వెళితే.. అభిషేక్ బచ్చన్ సరసన ‘ఘుమర్’ అనే చిత్రంలో నటించింది (Actress) సయామీ కేర్. ఆ మూవీ ఆగస్టు 18 న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈమె పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఈమె ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చింది. కెరీర్ ప్రారంభంలో ఈమె సినిమా అవకాశాలు కోసం ప్రయత్నిస్తూ ఉండగా.. ఓ వ్యక్తి చేసిన కామెంట్లు ఈమెను చాలా బాధపెట్టాయట. తమ సినిమాలో నటికి కావలసిన కనీస అర్హతలు తనకు లేవని అతను కామెంట్ చేసాడట.

ముక్కు, మూతి, నోరు, బూ*స్ , నోస్ వంటివి ఏవీ బాలేదని .. ‘నువ్వు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటే తప్ప ఇండస్ట్రీలో ఎంటర్ అవ్వలేవు’ అంటూ దారుణంగా కామెంట్లు చేసి అవమానించినట్టు ఆమె చెప్పుకొచ్చింది. ‘ఇతరుల అందం గురించి, టాలెంట్ గురించి అలాంటి నెగిటివ్ కామెంట్లు చేయడం చాలా తప్పని, భవిష్యత్తులో అయినా వీటికి ఫుల్ స్టాప్ పడాలని’ ఆమె ఎమోషనల్ కామెంట్స్ చేసింది.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus