జరుగుతున్న వన్డే ప్రపంచకప్ టోర్నీ లో టీమ్ ఇండియా పేసర్ షమీ మంచి జోరు మీదున్నాడు. ఆడింది నాలుగు మ్యాచ్ అయినా 16 వికెట్లు తీసి అదరగొట్టాడు. రెండు మ్యాచ్‌లో ఐదేసి వికెట్లు తీసి అరుదైన ఘనత అందుకున్నాడు. దీంతో అతడిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అతడి బౌలింగ్‌కు బాలీవుడ్ నటి పాయల్ ఘోష్ కూడా ఫిదా అయినట్లుంది. ఏకంగా అతడికి పెళ్లి ప్రతిపాదనే చేసేసింది. “షమీని పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను” అంటూ పాయల్ ఘోష్ ఇటీవల తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ చేసింది.
అయితే, ఇందుకు ఓ షరతు కూడా పెట్టిందండోయ్..! షమీ తన ఇంగ్లిష్‌ను మెరుగుపర్చుకుంటే తాను పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ఆమె పోస్టు నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ‘ప్రేమకు భాషతో పనేంటి?’ అ కొందరు కామెంట్లు చేయగా.. ‘షమీ ఎలా స్పందిస్తాడో మరి’ అంటూ ఇంకొందరు ఫన్నీగా రాస్తున్నారు. ఏదేమైనా.. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. బాలీవుడ్ నటి, రాజకీయ నాయకురాలైన పాయల్ ఘోష్ మన తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమే.
తెలుగులో మంచు మనోజ్ నటించిన ‘ప్రయాణం’ సినిమాతో వెండితెరకు పరిచయమైన పాయల్.. ఆ తర్వాత పలు సినిమాల్లో కన్పించింది. ‘ఊసరవెల్లి’ సినిమాలో తమన్నాకు స్నేహితురాలి పాత్రలో మెప్పించింది. ఆ తర్వాత బాలీవుడ్ కు వెళ్లిపోయిన పాయల్.. 2020లో రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం రామాస్ అథవాలేకు చెందిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలో మహిళా విభాగానికి ఉపాధ్యక్షురాలిగా వ్యవహరిస్తోంది.
ఇక షమీ 2014లో హసీన్ జహాన్ ను వివాహం చేసుకోగా.. వీరిద్దరి మధ్య తీవ్ర స్థాయిలో మనస్పర్థలు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నారు. వీరి విడాకుల కేసుపై న్యాయస్థానంలో విచారణ జరుగుతోంది
మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!
కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!