Star Director: తన విడాకుల వ్యవహారాన్ని బయట పెట్టిన స్టార్ డైరెక్టర్

సినీ పరిశ్రమలో ఉన్న నటీనటులు తమ పర్సనల్ లైఫ్ గురించి, ఫ్యామిలీ లైఫ్ గురించి బయటకు చెప్పుకోడానికి ఇష్టపడరు. కానీ పుట్టగొడుగుల్లా పెరిగిన యూట్యూబ్ ఛానల్స్.. ఎవరొక ఫేడౌట్ అయిపోయిన సెలబ్రిటీని ఇంటర్వ్యూ చేయడం.. వాళ్ళ పర్సనల్ లైఫ్ ను ఇన్వాల్వ్ చేస్తూ క్వశ్చన్లు అడగడం వల్ల .. కొన్ని కీలక విషయాలు బయటపడటం మనం చూస్తూనే ఉన్నాం. ఇదిలా ఉండగా.. తాజాగా ఓ స్టార్ డైరెక్టర్.. తన భార్య గురించి ఊహించని కామెంట్లు చేశాడు.

ఆ (Star Director) స్టార్ డైరెక్టర్ మరెవరో కాదు రాంగోపాల్ వర్మ. ఈయన ఏం మాట్లాడినా సెన్సెషన్. పబ్లిసిటీ కోసం కూడా ఏదో ఒకటి మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తుంటాడు వర్మ. ఈయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన భార్య గురించి షాకింగ్ కామెంట్లు చేశాడు. ఆర్జీవీ చేసే పనులకి నిత్యం అతని భార్య రత్న అరుస్తూ ఉండేదట. ఇంటికి రాగానే ఆర్జీవీ పై ఓ రేంజ్లో ఆమె నోరేసుకుని పడిపోయేదట. ఆర్జీవీ మాటలు డైజెస్ట్ చేసుకునే విధంగా ఉండవు. రెచ్చగొట్టే విధంగానే ఉంటాయి.

అందుకే ఆమె రెచ్చిపోయేది అని స్పష్టమవుతుంది. అయితే ఆమె ఎంతలా తిట్టిపోసినా వర్మ సైలెంట్ గానే చూస్తూ ఉండేవాడట. అయితే ఒకసారి ఆమె సహనం కోల్పోయి.. వర్మని జుట్టుపట్టుకుని గోడకేసి కొట్టిందట. అయినా వర్మ ఆమెను రెచ్చగొట్టలేదట. ఇలా రోజూ కలిసుండి కొట్టుకోవడం కంటే.. విడిపోయి ఎవరి లైఫ్ ను వాళ్ళు లీడ్ చేసుకోవడం బెటర్ అని వర్మ నచ్చజెప్పి విడాకులు తీసుకున్నాడట.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus