నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలా గొప్ప నటుడు. పెద్ద స్టార్. అంతేకాదు పెద్ద ఫ్యామిలీకి చెందిన వ్యక్తి. అందుకే కావచ్చు ఆయన వ్యవహార శైలి వీరోచితంగా ఉంటుంది. ఆయన కోపిష్టి. ఇది కొత్త విషయం ఏమీ కాదు. చాలా మందిని బాలకృష్ణ కొట్టిన సందర్భాలు ఉన్నాయి. అందుకు సంబంధించిన వీడియోలు కూడా చాలా సార్లు వైరల్ అయ్యాయి. కానీ బాలయ్య.. ఊరికే ఎవరిపైనా చెయ్యి చేసుకోడు అనేది ఆయన సన్నిహితులు చెప్పే మాట.
ఇది పక్కన పెట్టేస్తే.. బాలయ్యతో 2 సినిమాలు చేసిన దర్శకుడు (K. S. Ravikumar) కె.ఎస్.రవికుమార్.. తాజాగా ఓ సినిమా ఈవెంట్లో బాలయ్య పై చేసిన కామెంట్స్ షాక్ ఇచ్చాయి. ఈయన బాలకృష్ణతో ‘జై సింహా’ ‘రూలర్’ వంటి సినిమాలు చేశాడు. (Jai Simha) ‘జై సింహా’ బాగానే ఆడింది. ‘రూలర్’ (Ruler) డిజాస్టర్ అయ్యింది. ఇక ఓ సినిమా వేడుకలో కె.ఎస్.రవికుమార్ మాట్లాడుతూ..”షూటింగ్లో ఎవరైనా నవ్వుతున్నట్లు కనిపిస్తే బాలకృష్ణ తట్టుకోలేడు. ఆయన్ని చూసి నవ్వుతున్నారని అనుకుంటాడు. దీంతో వెంటనే అతనికి కోపం వచ్చేస్తుంది.
ఆ నవ్వుతున్న వ్యక్తిని పిలిచి మరీ స్పాట్లో కొట్టేస్తాడు. ఓ మూవీ షూటింగ్ జరుగుతున్నా టైంలో నా అసిస్టెంట్ శరవణన్..ను ఫ్యాన్ తిప్పమని చెప్పాను. అతడు అనుకోకుండా బాలయ్య వైపు తిప్పాడు. దీంతో ఆయన విగ్గు కాస్త అటు ఇటు జరిగింది. ఆ టైంలో శరవణన్ నవ్వాడు. అది చూడగానే బాలకృష్ణకు కోపం వచ్చేసింది. ‘ఎందుకు నవ్వుతున్నావ్?’ అని గట్టిగా అరిచాడు.
ఎక్కడ ఆ టైంలో శరవణన్ ని కొట్టేస్తాడో అని భయపడి నేనే వెళ్లి.. ‘సర్ అతను మన అసిస్టెంట్ డైరెక్టర్?’ అని సర్ది చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా బాలకృష్ణ కోపం తగ్గలేదు దీంతో నేను ‘నోరు మూసుకొని ఇక్కడి నుండి వెళ్ళిపో?’ అని శరవణన్ పై అరిచాను. అప్పుడు బాలకృష్ణ కూల్ అయ్యాడు” అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ఇంటర్వ్యూ : ‘గామి’గురించి డైరెక్టర్ విద్యాధర్ కాగిత చెప్పిన ఆసక్తికర విషయాలు.!
ఇంటర్వ్యూ : ‘భీమా’ గురించి గోపీచంద్ చెప్పిన ఆసక్తికర విషయాలు
రోడ్డుపై యాంకర్ ఝాన్సీ చెత్త సేకరించడానికి కారణాలివేనా?