టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా, యాంకర్ గా ఝాన్సీ తనకంటూ మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. డిసెంబర్ నెలలో విడుదలైన సలార్ సినిమాతో ఝాన్సీ మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకున్నారనే సంగతి తెలిసిందే. సలార్2 సినిమాలో సైతం ఝాన్సీ పాత్ర ఉంటుందని ఈ పాత్ర స్పెషల్ గా ఉండనుందని సమాచారం అందుతోంది. తాజాగా ఝాన్సీ రోడ్డుపై చెత్త సేకరించడం ద్వారా వార్తల్లో నిలిచారు. పనివాడితో కలిసి ఎండుగడ్డి, ఎండిపోయిన అరటి ఆకులను తన కారులో ఎక్కించుకుంది.
ఎండుగడ్డి, ఆకులను కాల్చి బూడిద చేయవద్దని అవి మన మట్టికి చాలా ఉపయోగపడతాయని అవి ప్రకృతి సమతౌల్య సూత్రం అని కామెంట్లు చేశారు. తన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ఝాన్సీ ఈ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. ఝాన్సీ చేసిన పనిని నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు. ప్రజలకు అవగాహన కల్పిస్తూ సామాజిక బాధ్యతతో వ్యవహరిస్తున్నా ఝాన్సీని ఎంత మెచ్చుకున్నా తక్కువేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఝాన్సీ ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఝాన్సీని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. సోషల్ మీడియాలో సైతం ఝాన్సీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు. ఝాన్సీకి గతంతో పోల్చి చూస్తే ఆఫర్లు తగ్గినా మంచి పాత్రలను ఆమె ఎంచుకుంటున్నారు. బుల్లితెరపై మాత్రం ఆమె ఎక్కువగా కనిపించడం లేదు. ఝాన్సీ 1994 నుంచి ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉన్నారు.
కెరీర్ తొలినాళ్లలో ఆమె పలు సీరియళ్లలో సైతం నటించారు. ఝాన్సీ (Jhansi) రేంజ్ మరింత పెరగాల్సి ఉందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ప్రస్తుతం వెబ్ సిరీస్ లకు క్రేజ్ పెరుగుతుండటంతో ఝాన్సీ వెబ్ సిరీస్ లపై ఫోకస్ పెడితే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఝాన్సీ ఇతర భాషలపై కూడా దృష్టి పెడితే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
‘సలార్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?!
నయన్ విఘ్నేష్ మధ్య విబేధాలకు అదే కారణమా.. అసలేమైందంటే?
నిశ్చితార్థం చేసుకున్న వరలక్ష్మి శరత్ కుమార్.. వరుడి బ్యాగ్రౌండ్ ఇదే!