స్టార్ హీరో సినిమా రూ.15 కోట్లలో అయిపోయిందా.. కలెక్షన్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!

  • May 25, 2024 / 03:45 PM IST

ఏడాదికి సినిమా పరిశ్రమలో హిట్ పర్సెంటేజ్ చూసుకుంటే.. 10 నుండీ 15 శాతం మాత్రమే ఉంటుంది. ఇప్పట్లో ఏ సినిమా చేయాలన్నా.. అది కోట్లతో కూడుకున్నదే. మేకింగ్లో చిన్న లోపం వచ్చినా బడ్జెట్ హద్దులు దాటేస్తుంది. అప్పుడు రికవరీ కష్టం అవుతుంది. స్టార్ హీరోల సినిమాలకి అయితే ఏదో ఒక రకంగా రికవరీ జరిగిపోతుంది. కానీ చిన్న హీరోల సినిమాలు కావచ్చు. చిన్న సినిమాలు కావచ్చు.. బిజినెస్ పరంగా రికవర్ అవ్వడం కష్టం.

సరే ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. ఓ స్టార్ హీరో సినిమా రూ.15 కోట్లతో నిర్మితమై.. బాక్సాఫీస్ వద్ద రూ.900 కోట్ల వరకు కలెక్ట్ చేసి భారీ లాభాలు అందించిందట. అవునా ఇదెప్పుడు జరిగింది? 2017 లో రిలీజ్ అయిన ఓ సినిమా ఈ వండర్ క్రియేట్ చేసింది. ఆమిర్ ఖాన్ (Aamir Khan) కీలక పాత్రలో ‘సీక్రెట్ సూపర్ స్టార్’ అనే సినిమా రూపొందింది. ఆమిర్ ఖాన్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించాడు.

ఈ సినిమాని అతనే ‘జీ స్టూడియోస్’ తో కలిసి నిర్మించాడు. అద్వైత్ చందన్ (Advait Chandan) దీనికి దర్శకుడు. బడ్జెట్ రూ.15 కోట్లకి మించలేదు. రిలీజ్ టైంలో దీని పై పెద్దగా బజ్ లేదు. కానీ టాక్ పాజిటివ్ గా ఉండటంతో కలెక్షన్స్ పెరిగాయి. మొదట రీజనల్ మూవీగా రిలీజ్ అయిన ఈ సినిమా.. ఆ తర్వాత పక్క భాషల్లో,పక్క దేశాల్లో కూడా రిలీజ్ అయ్యి అక్కడ కూడా బ్లాక్ బస్టర్ అయ్యి భారీ వసూళ్లు సాధించింది.

మొత్తంగా ఈ సినిమా రూ.900 కోట్లు కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ పండితుల సమాచారం. అయితే ఇదే అద్వైత్ చందన్ తో ఆమిర్ ఖాన్ ‘లాల్ సింగ్ చడ్డా’ (Laal Singh Chaddha) చేశాడు. ఇది పెద్ద డిజాస్టర్ అయ్యింది. కనీసం ఈ సినిమా పావు వంతు కూడా రికవరీ చేయలేదు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus