Star Heroes: ఓకే సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిలను పెళ్లి చేసుకున్న స్టార్ హీరోలు వీళ్లేనా..?

గత కొంతకాలంగా చూసుకుంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన హీరోలు దాదాపుగా రెడ్డి సామజిక వర్గానికి సంబందించిన ఆడవాళ్ళని తమ జీవిత భాగస్వాములుగా ఎంచుకోవడం కనిపిస్తోంది. అయితే ఇదేమి కొత్తగా జరగటం లేదు. ఒక దశాబ్ద కాలం కిందటే ఈ పరంపర స్టార్ట్ అయింది. ఇక నిన్నటికి నిన్న శర్వానంద్ కూడా ‘రక్షిత రెడ్డి’ అనే అమ్మాయి మెడలో మూడు ముళ్ళు వేసాడు. ఈ విషయమే ఇపుడు సర్వత్రా చర్చనీయాంశం అయింది.

కొన్నాళ్ల క్రితం ఆర్ ఎక్స్ 100 నటుడు కార్తికేయ కూడా ‘లోహిత రెడ్డి’ అనే అమ్మాయిని వివాహం చేసుకోగా, మంచు విష్ణు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్ సోదరి ‘వెరోనికా రెడ్డి’ని వివాహం చేసుకున్నాడు. ఇక ఆయన సోదరుడు, అందరికంటే చిన్నవాడు హీరో మంచు మనోజ్ కూడా ‘ప్రణతి రెడ్డి’ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత కూడా మంచు మనోజ్ రెండో వివాహం ‘భూమా మౌనిక రెడ్డి’తో కావడం కొసమెరుపు.

ఇక కొన్ని సంవత్సరాల క్రితం అల్లు వారి అబ్బాయి అర్జున్ సైతం ‘స్నేహ రెడ్డి’ని ప్రేమించి పెళ్లిచేసుకోగా వీరికి ఇప్పుడు ఇద్దరు సంతానం. అదేవిధంగా అక్కినేని హీరో సుమంత్ సైతం ‘కీర్తి రెడ్డి’ అనే హీరోయిన్ ని ప్రేమించి పెళ్లి చేసుకొని కొన్నాళ్ళకు విడాకులు ఇచ్చాడు. ఇక తెలంగాణ హీరోగా పేరుబడ్డ నితిన్ కూడా ‘షాలిని రెడ్డి’ అనే అమ్మాయిని మొన్న ఆ మధ్య పెళ్లి చేసుకొని అభిమానులకు షాక్ ఇచ్చాడు. అంతెందుకు మెగా వారసుడు రామ్ చరణ్ కూడా అపోలో సంస్థల ఛైర్మెన్ ప్రతాప్ రెడ్డి మనవరాలిని పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిన సంగతే.

అంతేకాకుండా బ్రహ్మానందం పెద్ద కుమారుడు రాజ్ గౌతమ్ రెడ్డి సామజిక వర్గానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం విశేషం. అక్కినేనిని నాగార్జున కోడలు యార్లగడ్డ సుప్రియ ‘చరణ్ రెడ్డి’ అనే నటుడిని ప్రేమించి పెళ్లి చేసుకోగా అతడు చనిపోయాడు. ఇలా చాల మంది హీరోలు రెడ్డి అమ్మాయిలపై మనసు పారేసుకుంటున్నారు మరి. అయితే ఇది యాదృశ్చికంగానే జరుగుతుందని పండితులు చెబుతున్నారు.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus