వ్యాక్సిన్ తీసుకున్న తారలపై హీరోయిన్ కామెంట్స్!

  • May 12, 2021 / 03:39 PM IST

కరోనా సెకండ్ వేవ్ కారణంగా రోజుకి లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ప్రతీ ఒక్కరూ స్వీయనియంత్రం పాటించడంతో పాటు కోవిడ్ వ్యాక్సిన్ తప్పకుండా తీసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఇప్పటికే చాలా మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. సెలబ్రిటీలు కూడా వ్యాక్సిన్ వేయించుకొని.. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. ప్రతీ ఒక్కరు తమకు అవకాశం ఉన్నప్పుడు వ్యాక్సిన్ తీసుకోవాలని సూచిస్తున్నారు మన తారలు. వ్యాక్సిన్ వలన ఎలాంటి ప్రాణహాని ఉండదంటూ అవగాహన కల్పిస్తున్నారు.

వ్యాక్సిన్ పై అవగాహన కల్పించడం వరకు బాగానే ఉంది కానీ.. వ్యాక్సిన్ తీసుకుంటూ కొందరు సెల్రబిటీలు చేసే ఓవరాక్షన్ చూడలేకపోతున్నామని అంటోంది టీవీ నటి ఆషా నేగీ. వ్యాక్సినేషన్ వీడియో అప్లోడ్ చేస్తున్న యాక్టర్లు అవగాహన కల్పించడం మంచిదే కానీ.. దయచేసి ఓవర్ యాక్టింగ్ చేయండి.. చాలా చిరాకుగా ఉంటుంది అంటూ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పెట్టింది ఆషా నేగీ. అయితే ఆమె పెట్టిన పోస్ట్ లో ఎవరి పేర్లను ప్రస్తావించలేదు.

కానీ నెటిజన్లు మాత్రం అంకిత లోఖండేని ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం వ్యాక్సిన్ తీసుకున్న అంకిత లోఖండే వీడియో పోస్ట్ చేసింది. అందులో ఆమె భయపడిపోతూ.. దేవుడిని ప్రార్ధిస్తూ వ్యాక్సిన్ తీసుకుంది. తన సహ నటి చేసిన ఓవర్ యాక్షన్ చూసి ఆషా ఇలా రియాక్ట్ అయిందంటూ నెటిజన్లు భావిస్తున్నారు.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus