విజయశాంతి రేంజ్ బిల్డప్ ఇస్తే.. భారీ నష్టాలు వచ్చాయట..!

పాయల్ రాజ్ పుత్.. ‘ఆర్.ఎక్స్.100’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. మొదటి చిత్రంతోనే యూత్ కు సెగలు పుట్టించింది. ఆ చిత్రంలో ఈమె చేసిన ముద్దుసీన్లు, ఇంటిమేట్ సీన్స్ బాగా పండాయి. అందుకే ఈమెకు భారీ క్రేజ్ ఏర్పడింది. ఇక అటు తరువాత వరుస ఆఫర్లు ఈమెను వెతుక్కుంటూ వచ్చాయి. కానీ ఈమె పారితోషికం పై ఉన్న మక్కువతో ‘ఆర్.డి.ఎక్స్ లవ్’ అనే చిత్రం చేసింది. సి.కళ్యాణ్ దీనికి నిర్మాత. ఇక ప్రమోషన్స్ లో భాగంగా మొదట ఓ టీజర్ ను విడుదల చేశారు.

అందులో పాయల్ హాట్ సీన్స్ ఓ రేంజ్లో ఉన్నాయి. ఆ టీజర్ పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది కానీ.. ‘పాయల్ ఇక పూర్తిగా గ్లామర్ నే నమ్ముకున్నట్టు ఉంది’ అనే కామెంట్స్ కూడా వినిపించాయి. ఈ నేపథ్యంలో పాయల్ తన ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని నిర్మాత సి.కళ్యాణ్ కు మొరపెట్టుకుందట. దాంతో సెకండ్ టీజర్ ను పూర్తిగా హీరోయిన్ క్యారెక్టర్ ను పరిచయం చేస్తూ రిలీజ్ చేశారు. ఈ టీజర్లో పాయల్.. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి రేంజ్లో కనిపించింది. అప్పటికే పాయల్ ను గ్లామర్ కోణంలో చూసిన కుర్రకారు.. అంత వెయిట్ ఉన్న పాత్రలో ఆమెను చూడడానికి మొహం చాటేశారు.

దాంతో ‘ఆర్.డి.ఎక్స్ లవ్’ సినిమా విడుదలైనప్పుడు యూత్ ఎవ్వరూ పట్టించుకోలేదు. థియేటర్లకు ఎవ్వరూ రాకపోవడం ఆ తరువాత సినిమా టాక్ కూడా నెగిటివ్ గా రావడంతో నిర్మాతకు భారీ నష్టాలు వచ్చాయట. మరో గ్లామర్ టీజర్ ను విడుదల చేసి ఉంటే కచ్చితంగా ఓపెనింగ్స్ అయినా వచ్చి ఉండేవని.. పాయల్ అలాంటి టీజర్ ను విడుదల చెయ్యొద్దు అని రిక్వెస్ట్ పెట్టుకోవడం వల్లే రూ.7కోట్ల వరకూ నష్టం వచ్చినట్టు ఇటీవల ఓ సందర్భంలో నిర్మాత చెప్పుకొచ్చారు.

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus