పవన్ మాత్రమే కాదు.. ఆ స్టార్ హీరో కూడా నో చెప్పాడట..!

  • June 15, 2020 / 05:21 PM IST

కుటుంబ కథా చిత్రాల్లో ‘పెళ్లి సందడి’ చిత్రాన్ని ప్రేక్షకులు ఇప్పటికీ ఎంతలా ఆదరిస్తారో… ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రాన్ని కూడా అదే విధంగా ఆదరిస్తూ ఉంటారు. చెప్పాలంటే కుటుంబ కథా చిత్రాల్లో ఇది ఒక గేమ్ చేంజర్ మూవీ అనే చెప్పాలి. ఇద్దరు స్టార్ హీరోలు అన్నదమ్ములుగా నటిస్తున్నప్పటికీ.. పాత సినిమాల్లోలా ‘అన్నయ్యా.. తమ్ముడు’ అంటూ ఎమోషనల్ గా హీరోలు ఏడ్చే సన్నివేశాలు ఇందులో ఉండవు. అయినా కూడా ఎమోషనల్ గా కనెక్ట్ అయిన ప్రేక్షకులు ఉన్నారు.

టాలీవుడ్ లో ఇప్పుడు వరుసగామల్టీ స్టారర్ సినిమాలు వస్తున్నాయి అంటే.. దానికి బీజం పడింది ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంతోనే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.! ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేసాడు. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాత. 2013 జనవరి 11న సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. నిజానికి ఈ చిత్రాన్ని ముందుగా ఇద్దరు స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారట. ముందుగా ఈ చిత్రంలోని పెద్దోడు(వెంకటేష్) పాత్రకు మన కింగ్ నాగార్జున ను అనుకున్నారట.దర్శకుడు శ్రీకాంత్.. నాగ్ కు కథ కూడా వినిపించాడట.

కానీ ఆ పాత్ర నాగార్జునకు నచ్చలేదట. సినిమా కథ కూడా డౌట్ గా అనిపిస్తుందని నాగార్జున వెనకడుగు వేసినట్టు తెలుస్తుంది. ఇక చిన్నోడు(మహేష్ బాబు) పాత్రకి మొదట పవన్ కళ్యాణ్ ను అనుకున్నారు.ఈ విషయం అందరికీ తెలిసిందే. ‘వెంకటేష్, పవన్ కళ్యాణ్ మల్టీ స్టారర్ మూవీ రాబోతుంది’ అని అప్పట్లో అనధికారిక ప్రకటన కూడా వచ్చింది. కానీ టైటిల్ తో సహా కథ కూడా పవన్ కు నచ్చకపోవడంతో ఆయన కూడా ఈ ప్రాజెక్ట్ ను రిజెక్ట్ చేసినట్టు తెలుస్తుంది.

Most Recommended Video

కవల పిల్లలు పిల్లలు కన్న సెలెబ్రిటీలు వీరే..!
బాగా ఫేమస్ అయిన ఈ స్టార్స్ బంధువులు కూడా స్టార్సే
బాలయ్య సాధించిన అరుదైన రికార్డ్స్ ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus