అతిలోక సుందరి శ్రీదేవికి అప్పట్లో ఉన్న క్రేజ్ అంతా ఇంకా కాదు. ఆమె సినిమాలో ఉంది అంటే ఆ ప్రాజెక్ట్ కి భీభత్సమైన క్రేజ్ ఏర్పడేది. స్టార్ హీరోల సినిమాల్లో కూడా ఆమె ఉంది అంటే బిజినెస్ కి ఎటువంటి ఢోకా ఉండేది కాదు. సీనియర్ స్టార్ హీరోలైన చిరంజీవి, నాగార్జున వంటి వాళ్ళ సరసన ఆమె నటించింది. వెంకటేష్ సరసన కూడా క్షణ క్షణం సినిమాలో నటించింది. కానీ బాలయ్యకి మాత్రం శ్రీదేవి జోడీగా నటించలేదు.
తండ్రి ఎన్టీఆర్ సరసన నటించడం వల్లే శ్రీదేవితో బాలయ్య మూవీ చేయలేదనే రూమర్ ఒకటి ఎప్పటినుంచో ఉంది. కానీ ఇన్‌సైడ్ సర్కిల్స్ చెబుతున్న అసలు రీజన్ వేరే ఉంది. ‘రౌడీ రాముడు-కొంటె కృష్ణుడు’ ‘అనురాగ దేవత’ వంటి సినిమాల్లో బాలయ్య నటించారు. అందులో శ్రీదేవి ఎన్టీఆర్‌కే జోడీగా కనిపించింది. ఆ తర్వాత బాలయ్య సోలో హీరోగా స్టార్‌డమ్ తెచ్చుకున్నాక.. 1987లో దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు ‘సాహస సామ్రాట్’ మూవీ ప్లాన్ చేశారు. శ్రీదేవిని హీరోయిన్‌గా అనుకుని అఫీషియల్‌గా పేపర్ యాడ్స్ కూడా ఇచ్చేశారు. కానీ అప్పటికే నేషనల్ లెవెల్ క్రేజ్ ఉన్న శ్రీదేవి.. హీరోతో సమానంగా తన రోల్ ఉండాలని, టైటిల్‌లో కూడా తన పేరుకు ఇంపార్టెన్స్ ఇవ్వాలని కండిషన్స్ పెట్టిందట. ఆ మూవీలో అలాంటి స్కోప్ లేకపోవడంతో ఆమె ఆఫర్ రిజెక్ట్ చేసింది.
ఆ తర్వాత 1989లో వచ్చిన ‘భలే దొంగ’ సినిమాకు కూడా శ్రీదేవి ఇలాగే ‘నొ’ చెప్పారని సమాచారం.బ్యాక్ టు బ్యాక్ రెండుసార్లు శ్రీదేవి రిజెక్ట్ చేయడంతో బాలయ్య సీరియస్ అయ్యారట. ఇకపై తన సినిమాల్లో ఆమెను హీరోయిన్‌గా కన్సిడర్ చేయొద్దని మేకర్స్‌కు తెగేసి చెప్పేశారట. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ‘ఆదిత్య 369’. ఈ సైన్స్ ఫిక్షన్ మూవీకి శ్రీదేవిని తీసుకుంటే పాన్ ఇండియా రేంజ్‌లో రీచ్ ఉంటుందని డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ఎంత బతిమాలినా.. బాలయ్య మాత్రం ససేమిరా అన్నారట. అలా తన బ్లాక్‌బస్టర్ సినిమాల నుంచి శ్రీదేవిని ఆయన పక్కనపెట్టేశారు.
ఫైనల్‌గా 1992లో అశ్వినీదత్ నిర్మాణంలో రాఘవేంద్రరావు, బాలయ్య, శ్రీదేవి కాంబోలో ఓ సోషియో ఫాంటసీ మూవీ అనౌన్స్ అయ్యింది. కానీ ఏమైందో ఏమో ఆ ప్రాజెక్ట్ కూడా క్యాన్సిల్ అయ్యి, ఆ ప్లేస్‌లో ‘అశ్వమేధం’ పట్టాలెక్కింది. అందులో నగ్మా, మీనా హీరోయిన్లుగా నటించారు. సో వీటిని బట్టి.. ఎన్టీఆర్ పక్కన చేసిన హీరోయిన్లతో బాలయ్య నటించడనే లాజిక్ పూర్తిగా ఫేక్ అని అర్ధం చేసుకోవచ్చు. ఎందుకంటే ఎన్టీఆర్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్న రాధతో బాలయ్య కూడా ఆడిపాడారు. సో.. శ్రీదేవి డిమాండ్స్, ఆ తర్వాత వచ్చిన రిజెక్షన్స్ వల్లే ఈ సూపర్ హిట్ కాంబో సెట్ అవ్వలేదని స్పష్టమవుతోంది.