Little Hearts Mouli : లిటిల్ హార్ట్స్ మౌళి ‘దొంగ నా కొడుకు’ అంట.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే ?

Advertisement

డిజిటల్ ప్లాట్ఫార్మ్ నుంచి సినీ రంగంలోకి అడుగుపెట్టి, తన ప్రత్యేక కామెడీ టైమింగ్ తో యువతను ఆకట్టుకున్న నటుడు మౌళి, ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ముందుకు వస్తున్నాడు. ఇటీవల ‘లిటిల్ హార్ట్స్’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఈ యంగ్ టాలెంట్, తన నెక్ట్స్ మూవీతో మరింత గుర్తింపు సంపాదించాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ కొత్త చిత్రానికి పరిశీలిస్తున్న “దొంగ నా కొడుకు” అనే టైటిల్ టాలీవుడ్ వర్గాల్లో చర్చకు దారి తీసింది.

Little Hearts Mouli

ఈ ప్రాజెక్ట్‌లో ప్రత్యేకత ఏంటంటే.. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ భాగస్వామ్యం. పెద్ద బడ్జెట్ సినిమాలతో పాటు కంటెంట్ ఉన్న చిన్న చిత్రాలకు కూడా మద్దతు ఇస్తున్న ఈ సంస్థ, మౌళి లాంటి కొత్త తరహా నటుడితో సినిమా చేయడం మౌళి కెరీర్ కి బాగా కలిసొచ్చే అంశం. కథ, కథనంపై ఉన్న నమ్మకమే ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకువచ్చిందని సినీ వర్గాల టాక్.

ఈ చిత్రానికి దర్శకుడిగా ఆదిత్య రెడ్డి వ్యవహరించనున్నాడు. టైటిల్ వినగానే మాస్ టచ్ ఉన్నట్లుగా అనిపించినా, ఇది పూర్తిగా ఎంటర్‌టైనింగ్ క్రైమ్ కామెడీగా ఉండబోతుందని సమాచారం. మౌళి కామెడీ టైమింగ్‌ను దృష్టిలో ఉంచుకుని కథను రూపొందించినట్లు చెబుతున్నారు. నేటి యువతకు కనెక్ట్ అయ్యే అంశాలు, సరదా సన్నివేశాలు, అలాగే కొంత థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉండబోతున్నాయని తెలుస్తోంది.

యూట్యూబ్ వీడియోలతో మంచి ఫాలోయింగ్ సంపాదించిన మౌళి, ఇప్పుడు వెండితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు. ‘లిటిల్ హార్ట్స్’ తర్వాత వస్తున్న ఈ చిత్రం ఆయన కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ కావొచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతుండగా, త్వరలోనే పూర్తి వివరాలు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. మరి “దొంగ నా కొడుకు” టైటిల్‌తో రానున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు అలరిస్తుందో చూడాలి.

Venu Thottempudi : కూతురు వయసున్న అమ్మాయితో రొమాన్స్ నా వల్ల కాదు : వేణు తొట్టెంపూడి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus