Jason Sanjay: జేసన్‌ సంజయ్‌.. ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

ప్రముఖ కథానాయకుడు, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ జోసెఫ్‌ తనయుడు అనే ఎంట్రీని ఆశించకుండా.. తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునే పనిలో ఉన్నాడు జేసన్‌ సంజయ్‌. సందీప్‌ కిషన్‌ హీరోగా ‘సిగ్మా’ అనే సినిమాను అనౌన్స్‌ చేసి షాకిచ్చాడు. అదేంటి ‘విజయ్‌ కొడుకు హీరోగా ఎంట్రీ ఇస్తాడు అనుకుంటే ఇలా డైరక్టర్‌ అంటున్నారేంటి?’ అని అనుకున్నారు. అయితే సినిమాకు సంబంధించిన పుకార్లు, ప్రచార చిత్రాలు, వార్తలు చూశాక ‘కుర్రాడు ప్రామిసింగ్‌ ఎంట్రీనే ఇచ్చేలా ఉన్నాడు’ అనే మాట వినిపిస్తోంది.

Jason Sanjay

ఆ సినిమా సంగతులు తర్వాత చూద్దాం. ఇప్పుడు సంజయ్‌ పేరు గురించి చూద్దాం. పూర్తి జేసన్‌ సంజయ్‌ అయినప్పటికీ ఎక్కువమంది సంజయ్‌ అనే పిలుస్తున్నారు. ఈ విషయాన్ని కుర్రాడే చెప్పాడు కూడా. అంతేకాదు ఆ పేరు ఎలా వచ్చింది అనే మాట కూడా చెప్పాడు. Sanjay అనే పేరుతో తొలి మూడు అక్షరాలు San తల్లి Sangeetha నుండి తీసుకున్నారు. ఆఖరి మూడు అక్షరాలు Jay తండ్రి పేరు Vijay నుండి తీసుకున్నారట. అలా San–jay అన పెట్టారట.

ఇక ‘సిగ్మా’ సినిమా సంగతి చూస్తే.. ఈ సినిమాలో సందీప్‌ కిషన్‌ – ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రధారులు. ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. ముందుగా అనుకున్న ప్లాన్‌ ప్రకారమే జులై 31న విడుదల చేయాలని తొలుత నిర్ణయించారు. అయితే సెన్సార్‌ కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చిన ‘జన నాయగన్‌’ సినిమాను జులై 23న విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో.. తండ్రి సినిమా వచ్చినప్పుడు ఎందుకు అని ఓ వార్త గ్యాప్‌ ఇచ్చి ఆగస్టు 7న విడుదల చేస్తున్నారు.

పూర్తి స్థాయి యాక్షన్‌ సినిమాగా రూపొందిన ఈ ప్రాజెక్ట్‌పై కోలీవుడ్‌లో మంచి అంచనాలే ఉన్నాయి. సంజయ్‌ టేకింగ్ బాగుందని, సినిమా ఇంట్రెస్టింగ్‌గా వచ్చిందని చెబుతున్నారు. ఈ సినిమా తర్వాత సంజయ్‌ హీరోగా సినిమా స్టార్ట్‌ చేస్తారని టాక్‌. అలాగే డైరక్షన్‌ ఆలోచలు కూడా ఉన్నాయని ఆ మధ్య చెప్పాడు.

మీ మాటలకు జవాబు వచ్చేది అప్పుడే.. ‘టాక్సిక్‌’ ట్రోల్స్‌పై హీరోయిన్‌

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus