Subhashree: ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బిగ్ బాస్ బ్యూటీ!

  • October 25, 2023 / 05:23 PM IST

‘బిగ్ బాస్ 7 ‘ లో 5 వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన శుభ శ్రీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం. హౌస్ లో ఉన్న గ్లామర్ బ్యూటీల్లో ఈమె కూడా ఒకరు. అయితే ఊహించని విధంగా ఎలిమినేట్ అయిన 4 వ కంటెస్టెంట్ గా ఈమె నిలిచింది.ఇక శుభశ్రీ ‘రుద్రవీణ’ ‘కథ వెనుక కథ’ ‘అమిగోస్’ ‘అ! ‘ వంటి సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈమె ఊహించని విధంగా ఓ స్టార్ హీరో సినిమాలో నటించే అవకాశం దక్కించుకుందట.

ఈ విషయాన్ని స్వయంగా శుభశ్రీ చెప్పుకొచ్చింది. అందుతున్న సమాచారం ప్రకారం ఈమె పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలో ఛాన్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే శుభశ్రీ.. తన అభిమాన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఓజీ’ సినిమాలో ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం దక్కించుకుందట. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కి ఆమె హార్డ్ కోర్ ఫ్యాన్‌ కాబట్టి ఇదొక సువర్ణావకాశం అని..

అందుకు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు (Subhashree) ఆమె తన సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ‘నా టాలెంట్‌ను నమ్మి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సుజీత్.. నిర్మాత డీవీవీ దానయ్యకు థ్యాంక్స్ . అలాగే నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రేక్షకులకి కూడా ఆమె ఈ సందర్భంగా స్పెషల్ థ్యాంక్స్ అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో ‘ఓజీ’ దర్శకుడు సుజీత్‌తో దిగిన ఓ ఫొటోను కూడా ఆమె షేర్ చేసింది.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus