ప్రస్తుతం వరుస విజయాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ డైరెక్టర్లలో సుకుమార్ ఒకరిగా ఉన్నారు. సుకుమార్ పారితోషికం భారీ రేంజ్ లో ఉండగా పుష్ప2 సినిమాకు సంబంధించిన అప్ డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బన్నీ సుకుమార్ కాంబినేషన్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ కాగా సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన జగడం, 1 నేనొక్కడినే సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను అందుకోలేదు. అయితే ఒక సందర్భంలో సుకుమార్ జగడం సినిమా గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.
సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎలా మాట్లాడాలో తెలిసేది కాదని సుకుమార్ తెలిపారు. ప్రపంచం కూడా మనలాగే ఉంటుందని అనుకోలేదని సుకుమార్ చెప్పుకొచ్చారు. ఆర్య సినిమా బ్లాక్ బస్టర్ స్టేటస్ ను సొంతం చేసుకోవడంతో గాలిలో తేలిపోయానని సుకుమార్ కామెంట్లు చేశారు. ఆర్య సినిమా తర్వాత బన్నీతో జగడం చేయాలని భావించానని సుకుమార్ చెప్పుకొచ్చారు. కథ సిద్ధమైన తర్వాత దిల్ రాజుతో చిన్న సమస్య రావడంతో కోపం పట్టలేకపోయానని ఆయన అన్నారు.
ఆ సమయంలో బాగా ఎమోషనల్ అయ్యానని సుకుమార్ (Sukumar) వెల్లడించారు. రాత్రికి రాత్రే రామ్ కు కథ చెప్పి ఒప్పించానని సుకుమార్ పేర్కొన్నారు. మరుసటిరోజు మూహూర్తం పెట్టి బన్నీని, రాజుగారిని పిలిచానని ఆయన తెలిపారు. ఆ సమయంలో దిల్ రాజు నన్ను బుద్ధుందా అని తిట్టారని కోపంతో చెప్పకుండా సినిమా ఓపెన్ చేస్తావా అన్నారని ఆయన వెల్లడించారు.
నాది వీరత్వం అనుకున్నానని ఆర్య బ్లాక్ బస్టర్ కావడంతో నా జడ్జిమెంట్ తప్పని చెబితే కోపం వచ్చేదని సుకుమార్ తెలిపారు. జగడంలో హీరోగా మహేష్ లేదా బన్నీ చేసి ఉంటే బాగుండేదని ఆయన కామెంట్లు చేశారు. హీరో తమ్ముడి రోల్ కు రామ్ బాగుంటాడని సుకుమార్ అన్నారు. జగడం రిజల్ట్ నాలో చాలా మార్పు తీసుకొచ్చిందని ఆయన కామెంట్లు చేశారు.
జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!