రౌడి బాయ్ సైనికుడిగా మారితే..

టాలీవుడ్ ఇండస్ట్రీలో రానున్న రోజుల్లో మాత్రం నెవర్ బిఫోర్ అనేలా కాంబినేషన్స్ మాత్రం రాబోతున్నట్లు చాలా క్లారిటీగా అర్ధమవుతోంది. అందులో విజయ్ దేవరకొండ, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమా కోసం కూడా చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఆ సినిమా ఎలా తెరకెక్కుతుందో గాని ప్రస్తుతం కొన్ని రూమర్స్ మాత్రం అంచనాల డోస్ ను అమాంతంగా పెంచేశాయి.

సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ తో పుష్ప సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా ప్రాజెక్టుగా రూపొందుతున్న ఆ బిగ్ బడ్జెట్ సినిమా తరువాత వెంటనే సుక్కు, రౌడి హీరోను కలవబోతున్నాడు. ఇక సినిమా బ్యాక్ గ్రౌండ్ పై కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. ఆ సినిమాలో విజయ్ ఒక భారత సైనికుడిగా కనిపిస్తాడట. ఇండో – పాక్ యుద్ధ నేపథ్యంలోనే సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక డిఫరెంట్ ఎమోషన్స్ తో సినిమా కథను డిజైన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. మెయిన్ కథ అయితే సెట్టయ్యిందట. కానీ స్క్రిప్ట్ వర్క్ కొంత పూర్తి చేయాల్సి ఉందని సమాచారం. సుకుమార్ మార్క్ స్టైల్ లో ఎమోషనల్ లవ్ సీన్స్ కూడా ఉంటాయని సమాచారం. ఈ టాక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతోంది. కాంబినేషన్ పై అంచనాలు మాత్రం గట్టిగానే ఉన్నాయి. మరి సినిమాతో ఎలాంటి కిక్కిస్తారో చూడాలి.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus