Sulthan Collections: డిజాస్టర్ గా మిగిలిన కార్తీ ‘సుల్తాన్’..!

  • April 17, 2021 / 04:30 PM IST

కోలీవుడ్ తో పాటు టాలీవుడ్లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న నటుడు కార్తీ. ఈయన నటించిన లేటెస్ట్ మూవీ ‘సుల్తాన్’‌. ర‌ష్మిక మంద‌న హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి బ‌క్కియ‌రాజ్ క‌ణ్ణన్ ద‌ర్శకుడు. ‘డ్రీమ్ వారియ‌ర్ పిక్చర్స్’ బ్యాన‌ర్ ‌పై య‌స్‌.ఆర్‌. ప్రకాష్ బాబు, య‌స్‌.ఆర్‌.ప్రభు.. లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ ‌2న విడుదలైన ఈ చిత్రానికి యావరేజ్ టాక్ వచ్చింది.అయినప్పటికీ మంచి ఓపెనింగ్స్ నమోదయ్యాయి. కానీ వీక్ డేస్ లో సత్తా చాట లేకపోయింది.

ఇక ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం   1.23 cr
సీడెడ్   0.60 cr
ఉత్తరాంధ్ర   0.44 cr
ఈస్ట్   0.31 cr
వెస్ట్   0.20 cr
గుంటూరు   0.29 cr
కృష్ణా   0.31 cr
నెల్లూరు   0.16 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)   3.54 cr

‘సుల్తాన్’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో 6 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కాబట్టి ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే 6.5కోట్ల షేర్ ను రాబట్టాలి.ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం 3.54 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. అంటే బయ్యర్లకు 2.96కోట్ల నష్టాన్ని మిగిల్చిందన్న మాట. కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ కారణంగానే ఈ సినిమాకి ఎఫెక్ట్ పడినట్టు స్పష్టమవుతుంది.

Click Here To Read Movie Review

Most Recommended Video

‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus