Sundarakanda: ‘సుందరకాండ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Advertisement

నారా రోహిత్ 5 ఏళ్ళ గ్యాప్ తర్వాత మళ్ళీ సినిమాల్లో బిజీ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అతని మార్కెట్ కూడా బాగా డౌన్ అయ్యింది. ఈ క్రమంలో ‘ప్రతినిధి 2’ వంటి సూపర్ హిట్ సీక్వెల్.. అలాగే ‘భైరవం’ వంటి మల్టీస్టారర్ సినిమాలో నటించి మళ్ళీ తన ఉనికిని చాటుకునే ప్రయత్నాలు చేశాడు. తన క్యారెక్టర్ సెలక్షన్ విషయంలో ప్రేక్షకులను మెప్పించాడు అనే చెప్పాలి.

Sundarakanda

ఇక ఈ ఆగస్టు 27న ‘సుందరకాండ’ అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.ఈ సినిమా టీజర్, ట్రైలర్ వంటివి ఇంప్రెస్ చేశాయి. రిలీజ్ కి ముందే సినిమా శాటిలైట్, డిజిటల్ రైట్స్ మంచి రేటుకి అమ్ముడుపోయాయి. దీంతో చాలా వరకు రికవరీ జరిగిపోయింది. థియేట్రికల్ బిజినెస్ కూడా బాగానే జరిగింది అని చెప్పాలి. ఒకసారి వాటి వివరాలు గమనిస్తే :

అలాగే కొత్త సినిమాలు అందులోనూ బజ్ ఉన్న సినిమాలు ఏవీ రిలీజ్ కాకపోవడంతో.. దీనికి థియేట్రికల్ బిజినెస్ కూడా బాగానే జరిగింది అని చెప్పాలి. ఒకసారి వాటి వివరాలు గమనిస్తే :

నైజాం 1.20 cr
సీడెడ్ 0.20 cr
ఆంధ్ర(టోటల్) 1.30 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 2.70 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.20 cr
ఓవర్సీస్ 0.30 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 3.20 cr

‘సుందరకాండ’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.3.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కొరకు రూ.3.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. నారా రోహిత్ మార్కెట్ తో పోలిస్తే.. ఇది అంత ఈజీ టార్గెట్ ఏమీ కాదు. ఇది రీచ్ అవ్వాలంటే సినిమాకు పాజిటివ్ టాక్ రావాలి. అప్పుడే వినాయక చవితి హాలిడే, అలాగే వీకెండ్ అడ్వాంటేజ్ తో బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం ఉంటుంది.

‘బాహుబలి: ది ఎపిక్‌’.. ఆ పాట.. ఈ ముద్దూ ముచ్చట కట్‌.. ఎందుకంటే?

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus