Baahubali The Epic: ‘బాహుబలి: ది ఎపిక్‌’.. ఆ పాట.. ఈ ముద్దూ ముచ్చట కట్‌.. ఎందుకంటే?

రెండు ముక్కలుగా తీసిన సినిమాను ఒక్క ముక్క చేస్తానంటున్నారు? ఎలా సాధ్యం? ఐదున్నర గంటల నిడివి ఫుటేజ్‌ ఉన్న సినిమాను ఒక సినిమాగా ఎలా రిలీజ్‌ చేస్తారు? ‘బాహుబలి: ది బిగినింగ్‌’, ‘బాహుబలి: ది కంక్లూజన్‌’ కలిపి ‘బాహుబలి: ది ఎపిక్‌’ అనే పేరుతో రిలీజ్‌ చేస్తారు అనే వార్త బయటకు వచ్చినప్పటి నుండి ఇదే డౌట్‌. ఇప్పుడు దానికి ఓ దారి చెప్పారు ఆ సినిమాల దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి. చాలా మంది అనుకుంటున్నట్లుగా సినిమాలో కొన్ని సీన్స్‌ తీసేస్తున్నారట. అందులో ముఖ్యమైనవి కూడా ఉన్నాయి.

Baahubali The Epic

‘‘బాహుబలి: ది ఎపిక్‌’ సినిమా రిలీజ్ విషయంలో అన్నిటికంటే కష్టమైన పని ఎడిటింగ్. రెండు సినిమాలు కలిస్తే 5 గంటల 27 నిమిషాల రన్‌టైమ్‌ వస్తుంది. దీంతో ఈ సినిమాలో ఏ సీన్స్‌ ఉంచాలి? ఏ సీన్స్‌ తీసేయాలి? అనే విషయంపై సినిమా టీమ్‌ చర్చించుకుని ఓ నిర్ణయానికి వచ్చిందట. ‘‘బాహుబలి’ సినిమాలోని ప్రతి సన్నివేశం, పాట నాకు విలువైందే. దేన్ని ఉంచాలి? దేన్ని తీసేయాలో అర్థం కాలేదు. కానీ నిడివి తగ్గించాలంటే కొన్ని తీయక తప్పదు’’ అని నిర్ణయించుకున్నాం అని జక్కన్న ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

అలా ‘కన్నా నిదురించరా’ పాట, ప్రభాస్‌ – తమన్నా మధ్య వచ్చే కొన్ని ముద్దూముచ్చట సీన్స్‌ తీసేశాం అని జక్కన్న తెలిపారు. అలాగే మరికొన్ని సీన్స్‌ కూడా సినిమా నుండి తొలగించాం అని చెప్పారు. ఇప్పుడు ఈ సినిమా కచ్చితంగా కొత్త అనుభూతిని ఇస్తుంది అని అంటున్నారాయన. ఇక ఈ సినిమా విషయానికొస్తే.. అక్టోబర్‌ 31న సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ చేస్తున్నారు. ఇంత చెప్పిన రాజమౌళి సినిమా నిడివి మాత్రం చెప్పడం లేదు. ఏదైతేముంది ఈ సినిమాను తొలిసారి చూసేవారికి ‘వై కట్టప్ప కిల్డ్‌ బాహుబలి’ అనే విషయం ఓ 15 నిమిషాల్లో తెలుసుకుంటారు. అప్పట్లో అయితే సుమారు రెండేళ్లు పట్టింది.

ట్రోలింగ్‌ అంత నచ్చిందా? కావాలనే నాగవంశీ ట్రోల్‌ అవుతున్నారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus