నారా రోహిత్ హీరోగా వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వంలో చిత్రం ‘సుందరకాండ’(Sundarakanda).2025 ఆగస్టు 27న వినాయక చవితి కానుకగా ఈ సినిమా రిలీజ్ అయ్యింది. టీజర్, ట్రైలర్ వంటివి ఆడియన్స్ ను మెప్పించాయి.
మొదటి రోజు సినిమాకి డీసెంట్ టాక్ వచ్చింది. నెరేషన్ స్లోగా ఉన్నప్పటికీ ఇది ఒక మంచి మెచ్యూర్డ్ లవ్ స్టోరీ అని క్రిటిక్స్ మెచ్చుకున్నారు. పైగా హాలిడే అడ్వాంటేజ్ తో డీసెంట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది.
కానీ 2వ రోజు నుండి డౌన్ అయ్యింది. ‘కొత్త లోక’ సినిమా ప్రభావం గట్టిగా పడటంతో ‘సుందరకాండ’ కోలుకోలేకపోయింది అని చెప్పాలి. ఒకసారి ‘సుందరకాండ’ క్లోజింగ్ కలెక్షన్స్ ను గమనిస్తే :
| నైజాం | 0.82 cr |
| సీడెడ్ | 0.20 cr |
| ఆంధ్ర(టోటల్) | 0.63 cr |
| ఏపీ + తెలంగాణ(టోటల్) | 1.65 cr (షేర్) |
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.15 cr |
| ఓవర్సీస్ | 0.25 cr |
| వరల్డ్ వైడ్ (టోటల్) | 2.05 cr (షేర్) |
‘సుందరకాండ’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.3.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కొరకు రూ.3.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా రూ.2.05 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.3.52 కోట్లను కలెక్ట్ చేసింది.మొత్తంగా బయ్యర్స్ కి ఈ సినిమా రూ.1.45 కోట్ల నష్టాలు మిగిల్చి ప్లాప్ గా మిగిలిపోయింది అని చెప్పాలి. ఈ సినిమా కూడా వేరే టైంలో రిలీజ్ అయ్యి ఉంటే బెటర్ గా కలెక్ట్ చేసి ఉండేదేమో.