నా భర్త మతి చెడింది.. సీనియర్‌ స్టార్‌ హీరో భార్య షాకింగ్‌ కామెంట్స్‌

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు గొవిందా వ్యవహార శైలి గత కొన్ని ఏళ్లుగా విచిత్రంగానే సాగుతూ వస్తోంది. కొన్ని రోజులు ఆయన మేనల్లుడు, భార్య మధ్య కుటుంబ వివాదం, మరికొన్ని రోజులు ఆయన ఇంట్లో తుపాకీ ఫైరింగ్‌, ఆ తర్వాత ఆయన భార్య సునీత చేసిన విమర్శలు, ఆ తర్వాత అంతా ప్యాచప్‌ అనే కామెంట్లు వచ్చాయి. ఇప్పుడు మరోసారి ఆయన భార్య సునీతా అహుజా కామెంట్స్‌ చేసింది. ఈసారి కామెంట్ల డోస్‌ కాస్త ఎక్కువగానే ఉందని చెప్పాలి.

Sunita Ahuja

వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లుగా గోవిందా మతి చెడి ప్రవర్తిస్తున్నారని సునీత వ్యాఖ్యానించడం గమనార్హం. ఆమె అలా అనడానికి కారణం గత కొన్ని రోజులుగా గొవిందా.. కోమల్‌ రాణి స్వర్ణకార్‌ అనే నటితో సన్నిహితంగా మెలుగుతున్నట్లు వార్తలపై రావడమే. గత కొంతకాలంగా గోవిందా, సునీత మధ్య విభేదాలు ఉన్నాయి. కొంతమంది మహిళా నటులతో గొవిందాకు సంబంధాలున్నాయంటూ సునీత గతంలో బహిరంగంగా వ్యాఖ్యానించారు. అప్పుడు ఆమె మీదనే తిరిగి విమర్శలు వచ్చాయి.

తాజాగా ఎయిర్‌ పోర్టులో కోమల్‌ రాణి, గొవిందా కలసి వెళ్తున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. దీనిపై సునీత మాట్లాడుతూ గోవిందా వ్యవహార శైలిని మరోసారి తప్పుపట్టారు. వేరే నటీమణులతో ఆయన సంబంధాలు పెట్టుకొని నన్ను మోసం చేశాడని గతంలోనే చెప్పినప్పుడు ఆయన అభిమానులు నన్ను ట్రోల్‌ చేశారు. ఇప్పుడు వారేం సమాధానం చెబుతారు అని తిరిగి ప్రశ్నించారు ఈ విషయంపై ఇక నన్నేమీ అడక్కండి. ఈ విషయంలో మాట్లాడేందుకు ఇష్టం లేదు అని సునీత ముగించారు .

అయితే, సునీత గతంలో చేసిన వ్యాఖ్యలపై ఆ మధ్య గొవిందా స్పందిస్తూ… నా మీద ఉన్న ప్రేమతోనే ఆమె నన్ను అలా తిడుతోంది. ఆ తిట్లను కూడా ప్రేమగానే భావిస్తాను. నేను జీవితంలో ఈ స్థాయికి చేరడం వెనుక ఆమె శ్రమ చాలా ఉంది. పిల్లలను ఎంతో ప్రేమగా పెంచింది అని మెచ్చేసుకున్నాడు గొవిందా. మరిప్పుడు ఏమంటారో చూడాలి.

ప్రముఖ నటుడు, దర్శకుడు కన్నుమూత

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus