Sunny Leone: కుర్రాళ్లల కలల రాణిని ఇలా మార్చేశారేంటి? లుక్‌ మాత్రం వేరే లెవల్‌!

సన్నీ లియోన్‌ (Sunny Leone) హవా ఇప్పుడంటే తగ్గింది కానీ.. ఒకప్పుడు ఈ పేరు ఎత్తితే మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కుర్రకారు కిర్రెక్కిపోయేవారు. ఆమె కొత్త వీడియో ఇంటర్నెట్‌లో వచ్చింది అంటే ఎగబడి చూసేసేవారు. అంతలా తన స్పెషల్‌ వీడియోలతో యూత్‌లో క్రేజ్‌ సంపాదించుకుంది ఈ భామ. ఆ తర్వాత హఠాత్తుగా నేను ‘ఆ’ వీడియోలు ఆపేశాను అంటూ బాలీవుడ్‌ వచ్చేసింది. ఇక్కడికి వచ్చాక కొన్నాళ్లు అలాంటి సినిమాల్లో నటించిన ఆమె.. ఆ తర్వాత సగటు నటిలా మారిపోయింది.

గ్లామరస్‌ పాత్రలు, ప్రత్యేక గీతాలతో గత కొన్నేళ్లుగా కుర్రకారుని ఉర్రూతలూగిస్తున్న సన్నీ లియోన్‌.. ఇప్పుడు అందరికీ మరచిపోలేని షాక్‌ ఇచ్చింది. ఆమె నటిస్తున్న కొత్త సినిమా నుండి ఓ పోస్టర్‌ రిలీజ్ చేశారు. అందులో ఆమెను చూసిన కుర్రకారు ఒక్కసారిగా షాక్ అయ్యారు అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఆమె రెగ్యులర్‌ లుక్స్‌కి ఏ మాత్రం సంబంధం లేకుండా ఉంది ఆ పోస్టర్‌లో. అయితే కొత్త సన్నీ కూడా బాగుంది అంటున్నారు ఆమె అభిమానులు.

ప్రియమణితో (Priyamani) కలసి సన్నీ లియోన్‌ ఓ తమిళ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ‘కొటేషన్‌ గ్యాంగ్‌’ అనే పేరుతో ఆ సినిమాను వివేక్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. అందులో సన్నీ లుక్‌ గురించే ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. సన్నీ, ప్రియమణి రా – రస్టిక్‌ లుక్‌లో అదరగొట్టారు. అంతేకాదు యాక్షన్‌ సన్నివేశాలు కూడా ఇరగదీశారు అని చెప్పాలి. అయితే తన కొత్త అవతారం చూపించిన నేపథ్యంలో ఆమె పాత్రల ఎంపిక గురించి ఎమోషనల్‌ కామెంట్స్‌ కూడా చేసింది.

‘ఈ పాత్ర మీ ఇమేజ్‌ మారుస్తుంది’ అంటూ దర్శకనిర్మాతలు గొప్ప గొప్ప కథలతో తన దగ్గరికి వస్తుంటారని, ఆ మాట విన్న ప్రతిసారి సంతోషిస్తుంటాను. నా కోసం మరింత ప్రత్యేకంగా ఈ పాత్రను, కథను సృష్టించినందుకు ధన్యవాదాలు అని చెప్పింది. ఇక ఈ సినిమా విషయానికొస్తే.. జాకీ ష్రాఫ్‌ (Jackie Shroff) మరో కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమా వచ్చే నెలలో విడుదల కానుంది. తెలుగులో కూడా వచ్చే అవకాశం ఉంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus