Tollywood: టీ20 వరల్డ్ కప్ లో విజయం.. మహేష్, బన్నీ, తారక్, జక్కన్న రియాక్షన్స్ ఇవే!

టీ20 ప్రపంచ కప్ ఫైనల్‏లో టీమ్ ఇండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. సౌతాఫ్రికాతో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్ లో ఏడు పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించడంతో మన దేశంలోని క్రికెట్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మ్యాచ్ గెలిచిన తర్వాత ఆటగాళ్లు, అభిమానులు సాధించిన విజయాన్ని చూసి ఎమోషనల్ కావడం జరిగింది. టాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఈ విజయం గురించి సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ఎక్స్ (ట్విట్టర్) లో బ్లూ జెర్సీలు ధరించిన మన హీరోలు ప్రస్తుతం వరల్డ్ చాంపియన్లు అని ఈ కప్ మనది అని టీం ఇండియాకు శిరస్సు వంచి వందనం చేస్తున్నానని కామెంట్స్ చేశారు. క్రికెట్ చరిత్రలో సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ నిలిచిపోతుందని సూపర్ స్టార్ మహేష్ బాబు పేర్కొన్నారు. టీ20 వరల్డ్ కప్ విజయంతో గర్వంతో గుండె ఉప్పొంగిపోతుందని మహేష్ వెల్లడించారు.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)  టీం ఇండియాకు అభినందనలు తెలియజేయడంతో పాటు వాటే మ్యాచ్ అంటూ కామెంట్స్ చేశారు. మన క్రికెటర్లు భారత ప్రతిష్టను ఆకాశానికి ఎత్తేశారని యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు. మరో స్టార్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun) టీ20 వరల్డ్ కప్ లో విజేతగా నిలిచినందుకు ఇండియన్ క్రికెట్ టీమ్ కు అభినందనలు అని ట్వీట్ లో పేర్కొన్నారు.

దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఒకింత ఎమోషనల్ అవుతూ పోస్ట్ పెట్టారు. ఈ వరల్డ్ కప్ లో మనమే ఛాంపియన్స్ అని టీమ్ ఇండియాకు సెల్యూట్ అని రాజమౌళి పేర్కొన్నారు. టాలీవుడ్ సెలబ్రిటీలు టీం ఇండియా ఘన విజయం గురించి ట్వీట్స్ చేయడం అభిమానులకు మరింత ఆనందాన్ని కలిగిస్తోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus