Surekha Vani: కూతురి సినీ ఎంట్రీ పై సురేఖ వాణి షాకింగ్ కామెంట్స్!

  • February 1, 2024 / 06:07 PM IST

సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి సురేఖ వాణి ఒకరు ఈమె ఎన్నో సినిమాలలో వివిధ పాత్రలలో నటిస్తూ మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు. ఇకపోతే ఇటీవల కాలంలో సురేఖ వాణి సినిమాలను కాస్త తగ్గించి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా తన కుమార్తె సుప్రీతతో కలిసి సురేఖ వాణి చేసే హంగామా మామూలుగా ఉండదు పొట్టి పొట్టి దుస్తులను ధరించి తరచూ రీల్స్ చేయడమే కాకుండా వెకేషన్ లోకి వెళ్తూ వారికి సంబంధించిన ఫోటోలు అన్నిటిని కూడా అభిమానులతో పంచుకుంటున్నారు.

ఇలా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వగానే సోషల్ మీడియా వేదికగా సురేఖవాణి కుమార్తె సుప్రీత మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ఇకపోతే తాజాగా సుప్రీత సినిమా అవకాశాలను అందుకున్నారని హీరోయిన్గా ఈమె సినిమా ఇండస్ట్రీలోకి రాబోతున్నారని తెలుస్తుంది. బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా బుల్లితెర నటుడు అమర్ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ఈ సినిమాలో అమర్ సరసన సుప్రీత హీరోయిన్గా ఛాన్స్ అందుకున్నారు. నేడు ఈ సినిమా పూజా కార్యక్రమాలు ప్రసాద్ ల్యాబ్ లో ఎంతో ఘనంగా జరిగాయి.

ఈ పూజా కార్యక్రమాలలో భాగంగా నటి సురేఖ వాణి కూడా పాల్గొన్నారు. ఈ పూజా కార్యక్రమాల అనంతరం సురేఖ వాణి మాట్లాడుతూ తన కుమార్తె సినిమా అవకాశాలను అందుకోవడం తనకు చాలా సంతోషంగా ఉందని అయితే అందరి తల్లులు మాదిరిగా తనని ఇండస్ట్రీలోకి పంపించడానికి కాస్త భయపడ్డాను కానీ ఆమెకు చాలా మంచి టీం దొరికిందని తెలిపారు. ఇక అమర్ నాకు తమ్ముడుతో సమానం అంటూ ఈ సందర్భంగా సురేఖ వాణి (Surekha Vani) చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus