Suriya: తమ్ముడిపై అభిమానాన్ని చాటుకున్న సూర్య.. ఏం చెప్పారంటే?

  • October 30, 2023 / 10:46 AM IST

కోలీవుడ్ ఇండస్ట్రీలోని టాలెంటెడ్ హీరోలలో కార్తీ ఒకరు కాగా సినిమాసినిమాకు వైవిధ్యం చూపించే ఈ నటుడు క్రేజ్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు. కార్తీ నటించిన జపాన్ మూవీ త్వరలో థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ కు గెస్ట్ గా హాజరైన సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈరోజును అందమైన రోజుగా మార్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని సూర్య అన్నారు.

నా తమ్ముడు కార్తీకి అన్ని విధాలా ఛాన్స్ కల్పించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని సూర్య కామెంట్లు చేశారు. ప్రపంచ తమిళులంతా కార్తీకి అందమైన ప్రయాణంతో పాటు జీవితాన్ని అందించారని సూర్య తెలిపారు. అది 20 సంవత్సరాల క్రితమే ప్రారంభమైందని ఆయన అన్నారు. కార్తీ తొలి సినిమా పరుత్తివీరన్ అని ఆ సినిమా కమల్ పూజతో మొదలైందని సూర్య చెప్పుకొచ్చారు. పరుత్తివీరన్ విడుదలైన తర్వాత కార్తీని సరిగ్గా వినియోగించుకున్నారని సూర్య కామెంట్లు చేశారు.

ఒక సోదరుడిగా నేను కార్తీ కంటే ఎక్కువగా వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని సూర్య అన్నారు. కార్తీ కాలేజ్ వదిలేసి చాలా సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ తన ఫ్రెండ్స్ ను కలుస్తున్నాడని సూర్య వెల్లడించారు. ఒక అన్నగా గర్వపడుతున్నానని ఆయన కామెంట్లు చేశారు. నా అదృష్టవశాత్తూ లోకేశ్ కనగరాజ్ పరిచయం అయ్యారని నా పేరును రోలెక్స్ గా మార్చారని ఆ పాత్ర నా లైఫ్ ను మార్చేసిందని రోలెక్స్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారని సూర్య వెల్లడించారు.

ఢిల్లీ తర్వాతే రోలెక్స్ వస్తాడని సూర్య చెప్పుకొచ్చారు. తమ్ముడిపై సూర్య చూపించిన ప్రేమకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సూర్యను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. సూర్య, కార్తీ కలిసి నటిస్తే బాగుంటుందని అభిమానులు ఫీలవుతున్నారు. రాబోయే రోజుల్లో అభిమానుల కోరిక తీరుతుందేమో చూడాల్సి ఉంది.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus