ఏదో నేను కమర్షియల్ హీరోని… క్రేజ్ ఉన్న హీరోని కదా అని కేవలం సూట్ వేసుకుని… అది కూడా నలగకుండా ఫైట్ లు ఉండేలా చూసుకుని.. హిట్లు కొట్టెయ్యాలి అని సినిమాలు చెయ్యడు సూర్య. సేఫ్ గేమ్ ఆడే ఛాన్స్ ఉన్నా.. తను మాత్రం వైవిధ్యమైన కథలని మాత్రమే ఎంచుకుని ముందుకు వెళ్తూ ఉంటాడు. కథలో ఎంత రిస్క్ ఉన్నా… ఫలితం ఎలా వచ్చినా సూర్య వెనక్కి తగ్గుడు. నష్టాలు వస్తే పారితోషికాన్ని కూడా వెనక్కి ఇచ్చేస్తుంటాడు.
ఇక పాత్ర కోసం ఎంతైనా కష్టపడుతుంటాడు. దర్శకుడు ఎలా చెప్తే అలా సరెండర్ అయిపోతూ ఉంటాడు సూర్య. ఇప్పుడు ఆయన చేస్తున్న ‘ఆకాశమే నీ హద్ధురా’ సినిమా కోసం కూడా అంతే విధంగా కష్టపడ్డాడట సూర్య. కథ ప్రకారం 19 ఏళ్ళ యువకుడుగా సూర్య కనిపించాల్సి ఉందట. ఈ చిత్రం దర్శకురాలు సుధ కొంగర కొంచెం బరువు తగ్గమని అతనితో చెప్పగా..దీనిని సూర్య చాలా సీరియస్ గా తీసుకున్నాడట.44 ఏళ్ళు వయసున్న సూర్య ఎన్నో వర్కౌట్ లు చేసి నిజంగానే 19 ఏళ్ళ కుర్రాడిగా మారిపోయాడట.
గతంలో ‘సూర్య సన్ ఆఫ్ కృష్ణన్’ సినిమా కోసం ఎన్నో షేడ్స్ ఉన్న లుక్స్ కి ఒళ్ళు హూనం చేసుకున్నాడు సూర్య. ఇప్పుడు ఈ చిత్రం కోసం కూడా అదే విధంగా కష్టపడినట్టు తెలుస్తుంది. ఇక సూర్య వర్కౌట్ లు చేసిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు ‘ఆకాశమే నీ హద్ధురా’ టీం. ఇప్పుడు అది తెగ వైరల్ అవుతుంది. మీరు కూడా ఓ లుక్కెయ్యండి.
అత్యధిక టి.ఆర్.పి నమోదు చేసిన సినిమాల లిస్టు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
మన హీరోయిన్ల ఫ్యామిలీస్ సంబంధించి రేర్ పిక్స్!