Suriya – Venky: సూర్య కొత్త సినిమా పేరు ఇదేనా? రెండు చోట్లా ఇబ్బంది లేకుండా?

సూర్య, వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళంలో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి ఇప్పటికే కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమా టైటిల్‌ గురించి ఓ విషయం బయటకు వచ్చింది. దాని ప్రకారం చూస్తే ఇటు తెలుగు, అటు తమిళం ఇలా ఎక్కడా ఇబ్బంది లేకుండా ప్లాన్‌ చేశారు అని అర్థమవుతోంది. రెండు చోట్లా రెండు రకాల టైటిల్స్‌ పెట్టడం, లేదంటే తమిళ టైటిల్‌ నేరుగా పెట్టేయడం లాంటివి కాకుండా కామన్‌ టైటిల్‌ చూశారు.

Suriya – Venky

అంతేకాదు ఈ సినిమా పేరు చూస్తుంటే ఆ ప్రాజెక్ట్‌ నిర్మాతల్లో ఒకరైన త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ టచ్‌ కూడా కనిపిస్తోంది. సూర్య సినిమా కథ విషయంలో చాలా రోజులుగా వినిపిస్తున్న రూమర్‌. ఇది పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అని. దానికి తగ్గట్టే ‘విశ్వనాధం అండ్‌ సన్స్‌’ అని టైటిల్‌ అనుకుంటున్నారట. ఈ మాట తెలుగులో చెప్పినా, తమిళంలో చెప్పినా ఒక్కటే కదా. అందుకే ఇబ్బంది లేని టైటిల్‌ అని పైన చెప్పింది. ఈ టైటిల్‌ విన్నాక ఇలాంటి పేర్లు ఎక్కువగా త్రివిక్రమ్‌ పెడతారు కదా అనే మాట కచ్చితంగా వస్తుంది.

నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా గురించి టీమ్‌ చాలా కాన్ఫిడెంట్‌గా ఉంది. దానిక కారణం అంతకుముందు వెంకీ అట్లూరి తెరకెక్కించిన ‘లక్కీ భాస్కర్‌’ సినిమా భారీ విజయం అందుకోవడమే. ఇక పాత రూమర్ల సంగతి చూస్తే.. ఈ సినిమాలో సూర్య నడి వయస్కుడిగా కనిపిస్తాడు. ఇక అతని వయసులో సగం ఉండే మమిత బైజుతో ప్రేమలో పడేలా ఆ పాత్ర ఉంటుందట. ఇలాంటి కథతో ఓ సినిమా బాలీవుడ్‌లో 34 ఏళ్ల క్రితమే వచ్చింది.

1992లో బాలీవుడ్‌లో అనిల్ కపూర్ ప్రధాన పాత్రలో వచ్చిన ‘లమ్హే’. ప్రముఖ దర్శక నిర్మాత దివంగత యష్ చోప్రా ఈ సినిమా తెరకెక్కించారు. తండ్రి వయసు ఉన్న హీరోతో.. చనిపోయిన హీరోయిన్ కూతురు ప్రేమలో పడటం ఆ సినిమాలో మెయిన్ పాయింట్. శ్రీదేవి డ్యూయల్ రోల్‌లో నటించారు. అప్పట్లో డిజాస్టర్ అయిన ఈ సినిమా ఆ తర్వాత క్లాసిక్ అనిపించుకుంది. మరిప్పుడు వెంకీ అట్లూరి అలానే చూపిస్తారా ఏమన్నా మార్పులు చేస్తారా అనేది చూడాలి.

రిజెక్షన్స్‌.. అప్‌ అండ్‌ డౌన్స్‌.. మృణాల్‌ ఠాకూర్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus