ఎవ్వరూ ఊహించని విధంగా బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్..ఆత్మహత్య చేసుకోవడంతో దేశం మొత్తం దిగ్బ్రాంతికి గురయ్యింది. అయితే ‘ఇతను చేసింది 12 సినిమాల్లో మాత్రమే కదా’ అని ఎవ్వరూ ఆలోచించరు.. ఎందుకంటే భారత క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని జీవిత కథను ఈ హీరోతోనే తెరకెక్కించారు కాబట్టి.. ఇతను ఇండియా మొత్తం పాపులర్ అయ్యాడు. ‘చిచోరే’ చిత్రంతో కూడా ఇతను ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇదిలా ఉంటే.. ఇలాంటి నటుడు డిప్రెషన్ కు లోనయ్యి సూసైడ్ చేసుకున్నాడు అంటున్నారు.
దానికి అసలు కారణం ఏంటనేది ఇంకా వెలుగులోకి రాలేదు. అయితే అతని జీవితానికి సంబంధించి కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అసలు విషయం ఏమిటంటే.. ఇదే ఏడాది సుశాంత్ పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడట. బాలీవుడ్‌లో పలువురు ప్రముఖులకు ఇళ్లను చూసే ఏజెంట్ ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు. అతను మాట్లాడుతూ.. “సుశాంత్, తన కో స్టార్ రియాతో కలిసి బాంద్రాలో ఓ ప్రోపర్టీ చూడమని నాకు చెప్పాడు. త్వరలోనే వీళ్లిద్దరూ పెళ్లి చేసుకొని ఆ ఇంట్లో కాపురం పెట్టాలని భావిస్తున్నట్టు…
రియా నాతో చెప్పారు” అంటూ ఆ ఏజెంట్ చెప్పుకొచ్చాడు. ఇక రియా చక్రబర్తి,సుశాంత్.. గత యేడాదిగా డేటింగ్‌లో ఉన్నట్టు బాలీవుడ్ మీడియా వర్గాల నుండీ సమాచారం అందింది. గతంలో వీరు తీసుకున్న ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. కెరీర్ ప్రారంభంలో సుశాంత్.. అకింతా లోఖండేతో ఐదేళ్లు డేటింగ్ చేసాడు. ఆ తర్వాత ‘1 నేనొక్కడినే’ హీరోయిన్ కృతీ సనన్ తో కూడా ప్రేమాయణం నడిపినట్టు ప్రచారం జరిగింది. తనతో కూడా బ్రేకప్ అవ్వడంతో రియా చక్రబర్తి ని పెళ్లి చేసుకోవాలని సుశాంత్ డిసైడ్ అయినట్టు తెలుస్తుంది.
1
2
3
4
5
6
7
8
9
10
Most Recommended Video
మేకప్ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్ వందాల్’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!