ప్రియదర్శి సినిమాలంటే ఆడియన్స్ లో మంచి నమ్మకమే ఏర్పడింది. ఎందుకంటే కంటెంట్ ఉన్న కథలే చేస్తాడు అనే నమ్మకం అతను సంపాదించుకున్నాడు కాబట్టి. ‘మల్లేశం’ ‘బలగం’ ‘కోర్ట్’ వంటి సినిమాలతో సూపర్ హిట్లు మాత్రమే కాదు రెస్పెక్ట్ కూడా సంపాదించుకున్నాడు ప్రియదర్శి.
అతను హీరోగా రూపొందిన మరో వైవిధ్యమైన సినిమా ‘సుయోధన'(Suyodhana). ఇటీవల అంటే మార్చి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి షోతోనే మిక్స్డ్ టాక్ ను మూటగట్టుకుంది.
కాన్సెప్ట్ బాగున్నప్పటికీ.. కథనం వీక్ గా ఉండటంతో ఆడియన్స్ పెదవి విరిచారు. పైగా హీరో ప్రియదర్శి సినిమా ప్రమోషన్ కి సహకరించలేదు అంటూ నిర్మాత కూడా ప్రెస్ మీట్లో ఆవేధన వ్యక్తం చేయడంతో ‘సుయోధన’ రిలీజ్ తర్వాత ఎక్కువగా వార్తల్లో నిలిచింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ పెర్మామెన్స్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఒకసారి 4 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :
| మొదటి రోజు | 0.40 cr |
| రెండో రోజు | 0.36 cr |
| మూడో రోజు | 0.38 cr |
| నాలుగో రోజు | 0.18 cr |
| టోటల్ | 1.32 cr(గ్రాస్) |
‘సుయోధన’ చిత్రం 4 రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ.1.32 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. షేర్ పరంగా రూ.0.70 కోట్లు. ఈ సినిమా వరల్డ్ వైడ్ ధియేట్రికల్ బిజినెస్ రూ.3.5 కోట్ల వరకు జరిగింది. బ్రేక్ ఈవెన్ కి రూ.4 కోట్ల షేర్ ను రాబట్టాలి. అంటే బ్రేక్ ఈవెన్ కి మరో రూ.3.3 కోట్ల షేర్ ను రాబట్టాలన్న మాట.