Youth Collections: పర్వాలేధనిపించిన ‘యూత్’ ఓపెనింగ్స్

ధనుష్ నటించిన ‘అసురన్’ ‘సార్’ వంటి సూపర్ హిట్ సినిమాలతో చైల్డ్ ఆర్టిస్ట్ గా పాపులారిటీ సంపాదించుకున్నాడు కెన్ కరునాస్. అప్పుడే అతను ఫుల్ లెంగ్త్ హీరోగా, దర్శకుడిగా ‘యూత్’(Youth) అనే సినిమాని కూడా రూపొందించాడు.

Youth Collections

తమిళంలో మార్చి 19న రిలీజ్ అయ్యి కమర్షియల్ సక్సెస్ అందుకున్న ఈ సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘దురంధర్ 2’ వంటి పెద్ద సినిమాలు ఉండటంతో తెలుగులో ఒక వారం ఆలస్యంగా అంటే మార్చి 27 న రిలీజ్ అయ్యింది.

తమిళంలో సూపర్ హిట్ అయిన సినిమా కావడం వల్ల తెలుగు ఆడియన్స్ లో కూడా ఆసక్తి నెలకొంది.అయితే మొదటి రోజు ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయినప్పటికీ ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి అని చెప్పాలి. ఒకసారి 3 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

తెలంగాణ 0.25 cr
సీడెడ్ 0.07 cr
ఆంధ్ర(టోటల్)  0.20 cr
వరల్డ్ టోటల్ 0.52 cr (షేర్)

‘యూత్’ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో రూ.1.5 కోట్లకి విక్రయించారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.2 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 3 రోజుల్లో ఈ సినిమా రూ.0.52 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.1.48 కోట్ల షేర్ ను రాబట్టల్సి ఉంది.

నిరాశపరిచిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus