మారుతున్న కాలంతో పాటు ప్రేక్షకుల అభిరుచులు కూడా వేగంగా మారుతున్నాయి. ఒకప్పుడు సినిమా అంటే రెండు గంటల లోపలే ముగిస్తే అదే “పర్‌ఫెక్ట్ రన్‌టైమ్” అన్న భావన ఉండేది. కానీ ఇప్పుడు ఆ నిర్వచనమే మారిపోయింది. నేటి ప్రేక్షకుడు థియేటర్‌కు వెళ్లేటప్పుడు కేవలం కథ మాత్రమే కాదు, గ్రాండియర్ ఎక్స్పీరియన్స్ కోరుకుంటున్నాడు.
ఓటీటీ ప్లాట్‌ఫాంలు అందుబాటులోకి రావడంతో ఇంట్లోనే అనేక రకాల సినిమాలు, సిరీస్‌లు చూసే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో థియేటర్‌కు వెళ్లాలంటే ప్రత్యేకమైన ఫీలింగ్ అవసరం. భారీ సెట్లు, బలమైన పాత్రలు, ఎమోషనల్ కనెక్ట్, విజువల్ అద్భుతాలు, ఇవన్నీ ప్రేక్షకుడిని సీటుకు అతుక్కుపోయేలా చేస్తాయి. ఇలాంటి అనుభూతిని సినిమాలో అందించాలంటే దర్శకుడికి సహజంగానే ఎక్కువ సమయం కావాలి. అందుకే ఇటీవలి కాలంలో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన ఆర్ ఆర్ ఆర్ , పుష్ప , ధురంధర్ వంటి సినిమాలు దాదాపు మూడు గంటల నిడివితోనే వచ్చాయి.
ఇక చిన్న నిడివి సినిమాల విషయానికి వస్తే, చాలావరకు కొద్దీ రోజులు ఆగితే ఇంట్లో కూర్చొని ఇది ఓటీటీలో చూసేయొచ్చు అన్న భావన ప్రేక్షకుల్లో బలంగా పడిపోయింది. పైగా టికెట్ ధరలు, తినుబండారాల ధరలు ఆకాశమే హద్దుగా పెరిగిన నేపథ్యంలో డబ్బుకు తగ్గ వినోదం కావాలనే అంచనాలు పెరిగాయి.ఇదంతా గమనిస్తే కంటెంట్ బలంగా ఉంటే మూడు గంటల సినిమా అయినా ఆడియన్స్ ని థ్రిల్ కి గురిచేస్తుంది. అదే కంటెంట్ లేకపోతే గంటన్నర సినిమా చూడటం కూడా భారమే. రాబోయే రోజుల్లో ఈ ధోరణి మారుతుందా? లేక మరింత బలపడుతుందా? కాలమే సమాధానం చెప్పాలి.
Rashmika: ఏంటీ.. పెళ్లికి ముందు రష్మిక ఇలాంటి పాత్ర చేస్తోందా? రిస్కేనా?