తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి ఐదేళ్లు అవుతున్నా అందాల భామ తాప్సికి చెప్పుకునేందుకు మంచి హిట్ లేదు. తమిళం, మలయాళం సినిమాల్లో కనిపించినా గుర్తింపు తెచ్చుకోలేక పోయింది. దీంతో సొట్టబుగ్గల సుందరి బాలీవుడ్ కి వెళ్లిపోయింది. హిందీలో ఆమె నటించిన రన్నింగ్ షాదీ డాట్ కామ్ త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది.
దాని కంటే ముందు తాప్సి ఓ వీడియో సాంగ్ లో నటించింది. “తుమ్ హోం తో లగ్తా హై ” అంటూ సాగే పాటలో ఈ ముద్దుగుమ్మ యువత మనసు దోచుకుంది. ఈ వీడియోలో తాప్సి పెర్ఫార్మన్స్ ప్రముఖ నిర్మాత ఏక్తాకపూర్ కి భలే నచ్చిందంట. రాగిణి ఎం.ఎం.ఎస్, లవ్ సెక్స్ దోహా, వంటి అడల్ట్ సినిమాలు తీసిన ఈ స్టార్ నిర్మాతకి మరో గ్లామర్ నటి దొరికే సరికి సంబర పడిపోయిందని సమాచారం. ఏక్తాకపూర్ నిర్మించనున్న మరో అడల్ట్ కామెడీ మూవీ xxx లో నటించమని తాప్సిని సంప్రదించడం, అందుకు ఆమె అంగీకరించడం జరిగిపోయిందని తెలిసింది.
ఈ సినిమా అయినా తనని పాపులర్ చేస్తుందని తాప్సి భావిస్తోంది. పేరు కోసం ఈ బాటను ఎంచుకోవడం ఏ మాత్రం బాగా లేదని ఆమె అభిమానులు బాధపడుతున్నారు. టాప్ హీరోయిన్ కావాలని మోజులో తాప్సి ఏమి చేస్తుందో గమనించడం లేదని సినీ విశ్లేషకులు విమర్శిస్తున్నారు.