టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న నటీమణులలో తాప్సీ (Taapsee Pannu) ఒకరు. తాప్సీ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీకే పరిమితం కాగా ఈమె రెమ్యునరేషన్ భారీ స్థాయిలో ఉంది. భర్త మథియాస్ బోతో నా లవ్ తొలిప్రేమ కాదని ఆమె పేర్కొన్నారు. మథియాస్ బోను ప్రేమించడానికి ముందే కొన్నిసార్లు పరీక్షించాలనుకున్నానని తాప్సీ చెప్పుకొచ్చారు. తొలిచూపులో ప్రేమ అనే విచిత్రం మాత్రం మా లైఫ్ లో జరగలేదని ఆమె అన్నారు.
ప్రాక్టికాలిటీ కోసం నేను పరీక్షలు పెట్టడం జరిగిందని తాప్సీ వెల్లడించారు. నేను పెట్టిన ప్రతి పరీక్షలో మథియాస్ బో నెగ్గారని తాప్సీ అన్నారు. మథియాస్ బోను నేను ఎంతో ఇష్టపడ్డానని ఆమె చెప్పుకొచ్చారు. నేను మథియాస్ బోను ఎంతో గౌరవిస్తానని అతడిని ప్రేమిస్తూనే పెరిగానని తాప్సీ చెప్పుకొచ్చారు. మేము ప్రేమలో పడటం వెంట వెంటనే మాత్రం జరగలేదని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈ ఏడాది మార్చి నెల 23వ తేదీన తాప్సీ, మథియాస్ బో పెళ్లి జరిగింది. పరిమిత సంఖ్యలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఈ పెళ్లి జరగడం గమనార్హం. తాప్సీకి ఇన్ స్టాగ్రామ్ వేదికగా సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుండటం గమనార్హం. తాప్సీ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలకు లక్షల్లో లైక్స్ వస్తున్నాయి. తాప్సీకి కెరీర్ పరంగా తిరుగులేదని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
తాప్సీ తెలుగులో రీఎంట్రీ ఇచ్చినా భారీ స్థాయిలో సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే తక్కువని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. తాప్సీకి గతంతో పోల్చి చూస్తే బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం ఆఫర్లు తగ్గాయని సమాచారం అందుతోంది. తాప్సీ భర్త విషయంలో ఎన్నో పరీక్షలు పెట్టారని తెలిసి నెటిజన్లు ఎంతో ఆశ్చర్యానికి గురవుతున్నారు. తాప్సీ టాలెంట్ మామూలు టాలెంట్ కాదని నెటిజన్లు చెబుతున్నారు.